రాత్రి జరిగిన రభసకి ఉదయం లేవగానే వంట్లో అక్కడక్కడ కాస్త నెప్పిగా అనిపించింది. ( ష్…ఎక్కడెక్కడా అని అడగొద్దు..మీకు తెలీదా ఏమిటీ!). బద్దకంగా వళ్ళు విరుచుకొని కాఫీ కలుపుకోడానికి వంటగదికి వెళ్ళా. హాల్లో కూర్చుని, న్యూస్ పేపర్ ని తిరగేస్తున్న మా శ్రీవారు, వంటగది లోకి వెళుతున్న నన్ను చూసి “నీరూ…కాఫీ..” అని అరిచారు. నేను స్టవ్ వెలిగించి, దానిపై పాలగిన్నె పెట్టా. ఇంతలో బియ్యం డబ్బాలో దాచిన “స్వప్న” సెల్ నుండి మెసేజ్ వచ్చిన సౌండ్ వినిపించింది. ఉలిక్కిపడి మావారి వైపు చూసా. ఆయన అటువైపు తిరిగి ఉన్నాడు. ఏం చేస్తున్నాడో కనిపించడం లేదు. నెమ్మదిగా సెల్ తీసి మెసేజ్ చూసా. “గుడ్ మార్నింగ్” అని పంపాడు మా శ్రీవారు. “అమ్మనీ వాసుగా…రాత్రంతా గుడ్ నైట్ చేసిన నాకు కాఫీ తెమ్మని ఆర్డర్ వేసి, ముందుగా దీనికి గుడ్ మార్నింగ్ చెబుతావా…చెప్తా నీ పని..” అని కసిగా అనుకొని, “గుడ్ మార్నింగ్” అని రిప్లయ్ పెట్టి, ఆ సెల్ ని దాచేసి, స్టవ్ దగ్గరికి వచ్చా. ఆయన సెల్ సైలెంట్ మోడ్ లో పెట్టాడనుకుంటా. మెసేజ్ రిసీవ్ చేసుకున్న సౌండ్ కూడా రాలేదు. “ఈయనకి తెలివితేటలు బాగా పెరిగి పోతున్నాయ్.” అని ఉడుక్కొని, రెండు కప్పులు అందుకున్నా. అందులో పాలు పోసి, ఒక కప్పులో చక్కటి కాఫీ కలిపా. రెండో కప్పులో బోలెడంత కాఫీ పొడి వేసి, సుగర్ వేయకుండా కలిపేసి, మంచి కాఫీ నేను తీసుకొని, చెత్త కాఫీని ఆయనకి అందించా. ఆయన కాఫీ తాగుతుండగా, ఆయన మొహంలోకి చూసా. గరళాన్ని మింగిన శివుడు కూడా అంత ప్రశాంతంగా కనిపించడేమో. ఆనందం గా తాగేస్తున్నాడు. కొంపదీసి బాగుందేమో అని అనుమానం వచ్చి “కాఫీ బాగుందా?” అని అడిగాను. ఆయన నావైపు చూసి “మ్ఁ..బావుందే..” అన్నాడు. గబుక్కున ఆయన చేతిలోని కప్పు లాక్కొని టేస్ట్ చేసి తుపుక్కున ఊసేసి “ఇంత చెత్తగా ఉంటే అంత ప్రశాంతంగా ఎలా తాగేస్తున్నారండీ?” అన్నాను. నిజంగానే కాస్త బాధ వేసింది. “ఏమోనే ఎప్పుడూ బాగానే కలిపే నువ్వు, ఏదో అలోచనల్లో పడి ఇలా కలిపావనుకున్నా…ఒక్కసారి బాగోపోతే ఏమయ్యిందీ? ఇచ్చింది నువ్వే కదా.” అన్నాడు. ఒక్కసారిగా ఆయనకి నా మీద ఉన్న ప్రేమకి ఏడుపొచ్చేసింది. “సారీ అండీ..” అంటూ ఆయనా గుండెలపై వాలిపోయా. ఆయన నా తల నిమురుతూ “ఇదిగో..ఇలా బాధ పడతావనే చెప్పలేదు.” అని తలపై ముద్దు పెట్టుకొని, “లే…లేచి స్నానం చెయ్.” అన్నాడు. నేను మురిసిపోతూ ఆయన బుగ్గపై ముద్దుపెట్టి లోపలకి పోయా.తరువాత మరో రెండు గంటలకి ఆయన ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే డబ్బాలోంచి సెల్ తీసా. మనసులో రకరకాల ఆలోచనలు. అనవసరంగా ఆయన్ని పరస్త్రీ వ్యామోహంలో పడేస్తున్నానా? అంతలోనే ఉదయం ఆయన చూపించిన ప్రేమ గుర్తుకొచ్చింది. అంత ప్రేమ ఉన్న వ్యక్తి అసలు వేరే అమ్మాయికి పడతాడా? రకరకాల ఆలోచనలు. మెసేజ్ పెడదామా, వద్దా…మనసు అటూ ఇటూ కొట్టుకుంటుంది. ఇంతలో ఆ సెల్ కి మెసేజ్ రానే వచ్చింది. “ఏం చేస్తున్నారు మేడమ్?” అంటూ. ఇక ఫిక్స్ అయిపోయాను ఆయన దుంప తెంచాలని.నేను : సార్ ఏం చేస్తున్నారా అని ఆలోచిస్తున్నా…ఆయన : మేడమ్ ని చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని వెయిట్ చేస్తున్నాను.. నేను : ఎందుకో అంత తొందర?ఆయన : 34..26..34..ఈ మూడు నంబర్లూ నన్ను నిద్ర పోనీయడం లేదు…అందుకనీ..( “నీయబ్బా వాసుగా..రాత్రంతా కుమ్మికుమ్మి, వళ్ళంతా నెప్పులు తెప్పించేసావ్…ఇప్పుడు నిద్ర పట్టట్లేదంటావా..” అని కసిగా తిట్టుకున్నా..)నేను : నాకూ తొందరగానే ఉంది శ్రీవారూ( అని టైప్ చేసి, నాలుక కరచుకొని, “శ్రీవారూ” ని ఎరేజ్ చేసి…”సారూ” అని టైప్ చేసి, సెండ్ చేసా..)ఆయన : అబ్బ..నువ్వు సారూ అని పిలుస్తుంటే నాకేదో అయిపోతుందిక్కడ..నేను : ఏమయిపోతుందో!?ఆయన : అది మనం కలసినప్పుడు చెబుతాలే..( అబ్బో..రొమాన్స్ లో సస్పెన్సా…చెప్తా, చెప్తా..)నేను : సరే ఈరోజే కలుద్దాం.ఆయన : ఎక్కడ..ఎక్కడ..ఎక్కడా?( ఎంత తొందరో చూడండీ..)నేను : మధ్యహ్నం 3 గంటలకి…( అంటూ, ఒక రెస్టారెంట్ అడ్రెస్ టైప్ చేసా..)ఆయన : ఓకే…షార్ప్ 3 కి అక్కడవుంటా..ఉమ్మ..ఉమ్మాఅబ్బో ఉమ్మ..ఉమ్మా అంటూ ముద్దులు కూడా…తిక్కతిక్కగా ఉంది నాకు. బాగా ఏడిపించి దొబ్బాలని డిసైడ్ అయిపోయా. ఆదమరపుగా ఆయన నన్ను చూసినా గుర్తుపట్టకుండా, బ్లూకలర్ జీన్స్, పింక్ కలర్ టాప్ కొనుక్కొచ్చి వేసుకున్నా. హెయిర్ స్టైల్ మార్చా. అద్దంలో చూసుకున్నా. “అమ్మో నన్ను ఇలా చూస్తే, ఆయన నాకే పడిపోతాడు.” అనుకున్నా ముచ్చటగా. అంతలోనే డ్యూటీ ఫస్ట్ అనుకొని, రెస్టారెంట్ కి బయలుదేరా.ఒక పావుగంట ముందే చేరుకున్నాను రెస్టారెంట్ కి. అది మేము రెగ్యులర్ గా వెళ్ళే రెస్టారెంటే. కౌంటర్ వెనక ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నా. అక్కడ కూర్చుంటే లోపలకి వచ్చేవాళ్ళు నాకు కనిపిస్తారు, కానీ నేను వాళ్ళకి కనబడను. కూర్చోగానే, ఆయనకి మెసేజ్ పెట్టా “ఐ యామ్ వెయిటింగ్” అని. “5 మినిట్స్” అని ఆయన మెసేజ్ పెట్టాడు. “ఓకే…లోపలకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కత్రినా పోస్టర్ ఉంటుంది. అక్కడ కూర్చోండి.” అని రిప్లయ్ ఇచ్చా. ఐదు నిమిషాల తరువాత రెస్టారెంట్ లోకి వచ్చాడాయన. నేరుగా వెళ్ళి నేను చెప్పిన చోట కూర్చొని, నాకు మెసేజ్ పెడుతున్నాడు. నాకు అయన కనిపిస్తున్నాడు, కానీ నేను ఆయనకి కనిపించను. మెసేజ్ వచ్చింది.ఆయన : ఎక్కడా?నేను : ఇక్కడే…(ఆయన అటు ఇటూ చూసి..)ఆయన : ఏ డ్రెస్ లో ఉన్నావ్?(అటూ ఇటూ చూస్తే, రెడ్ డ్రెస్ లో ముగ్గురు, నలుగురు అమ్మాయిలు కనిపించారు..)నేను : రెడ్ డ్రెస్ లో ఉన్నాను.ఆయన bananaకనీసం చూడనైనా చూడకుండా..) నువ్వు డెఫినెట్ గా రెడ్ డ్రెస్ వేసుకు రాలేదు.(నేను ఆశ్చరయపోయాను.)నేను : మీకెలా తెలుసు?ఆయన : ఫస్ట్ టైమ్ తన లవర్ ని కలుసుకోడానికి వచ్చే ఏ అమ్మాయీ రెడ్ డ్రెస్ వేసుకోదు.నేను : మరి?ఆయన : పింక్ లేదా బ్లూ లేదా రెండూ కలసిన కాంబినేషన్.( గబుక్కున నా డ్రెస్ చూసుకున్నా. పింక్ అండ్ బ్లూ…కొంపదీసి నన్ను కనిపెట్టేసాడా అనిపించింది. ఆయన వైపు చూస్తే అసలు ఎటూ చూడకుండా చిద్విలాసంగా కూర్చొని ఉన్నాడు.)నేను : ఓకే…మీరు చెప్పింది కరెక్ట్. మరి నేనెక్కడున్నానో కనుక్కోండి. మీ అంతట మీరే కనుక్కుంటే, ఇప్పుడే మీరు ఎక్కడకి రమ్మంటే అక్కడకి వస్తా..ఆయన: లేకపోతే…?నేను : ఈ రోజుకి అంతే…మనం కలవం…3 మినిట్స్ టైమ్ మీకు..ఆయన: ఓకె…ఓకే..ఆయన పైకి లేచి రెస్టారెంట్ అంతా తిరిగి చూస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలతో ఏదో మాట్లాడితే, వాళ్ళు నవ్వి ఏదో చెప్పారు. ఆ తరువాత ఆయన నేను ఉన్న వైపుకు వచ్చారు. నేను టేబుల్ కిందకి దూరా. ఆయన చేతిలో సెల్ నన్ను చూస్తున్నట్టుగా అనిపించి, సిగ్గుపడ్డా. ఒక పది సెకన్ల తరువాత తిరిగి వెళ్ళి, తన సీట్ లో కూర్చొని మళ్ళీ మెసేజ్ పెట్టాడు.ఆయన : అసలు నువ్వు వచ్చావా?నేను : వచ్చా…ఇక్కడే ఉన్నా…మిమ్మల్ని చూస్తున్నా..ఆయన : అసలు నువ్వెలా ఉంటావ్? చిన్న హింట్ అయినా ఇవ్వొచ్చుగా..నేను : చెప్పాగా 34..26..34ఆయన : నీ హింట్ తగలెట్టా… బట్టలుంటే కొలతలు కనిపెట్టడం రాదు నాకు.( అది చూసి కిసుక్కున నవ్వాను. మళ్ళీ కంట్రోల్ చేసుకొని, మెసేజ్ పెట్టా.)నేను : చూడగానే కొలతలు కనిపెట్టేసేలా ప్రాక్టీస్ చేయండి మరి..ఆయన : నా పాక్టీస్ ఏదో నేను చేసుకుంటాలే గానీ, నువ్వు ఇక్కడకి రాకుండా గేమ్స్ ఆడతున్నావేమోనని డౌట్ వస్తుంది.నేను : సరే బేరర్ తో నా బిల్ పంపిస్తే నమ్ముతారా?ఆయన : యా..నేను : ఓకే…కానీ నేను ఎక్కడున్నానో అతన్ని అడగకూడదు.ఆయన : ఓకే..ఓకే..నేను : బిల్ క్లియర్ చేసిన వెంటనే వెళ్ళిపోవాలి..ఆయన : ఓకే..నేను : బయటకూడా నా కోసం చూడకూడదు. ఆగకుండా డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళిపోవాలి.ఆయన : అమ్మా, తల్లీ…అన్నిటికీ ఓకే..పంపించు.నేను నవ్వుకొని, బేరర్ ని పిలిచి బిల్ ఆయన కి ఇమ్మన్నాను. బేరర్ బిల్ ఇవ్వగానే ఆయన పాపం ఏమీ అడగకుండానే పే చేసేసి వెళ్ళిపోయాడు. నేను మరో పావుగంట అక్కడే ఉండి, తరువాత ఇంటికి చేరుకున్నాను.ఆయన వచ్చే టైముకి స్నానం చేసి, పింక్, బ్లూ కాంబినేషన్ ఉన్న చీర కట్టుకొని రెడీ అయ్యా. ఇంతలో ఆయన రానే వచ్చాడు. పలకరింపుగా నవ్వి, పోయి ఎప్పటిలాగే టీ.వీ ముందు కూర్చొని టీ ఆర్డర్ చేసాడు. నా చీర గుర్తించనందుకు నాకు మండిపోయింది. రుసరుసలాడుతూ టీ తయారుచేసి ఆయనకి విసురుగా అందించి ఎదురుగా నిలబడ్డాను. “అబ్బా, టీ.వీకి అడ్డులే నీరూ..” అన్నాడు టీ చప్పరిస్తూ. “టీ.వీ తరువాత చూడొచ్చు. ముందు నన్ను చూడండి.” అన్నాను. “కొత్తగా ఏం చూడాలే నిన్నూ! పక్కకి తప్పుకో.” అని కసురుకున్నాడు. నాకు ఆశ్చర్యమేసింది. పెళ్ళయిన ఇన్నాళ్ళుగా ఎప్పుడూ అలా కసురుకోలేదు. ఉక్రోషం వచ్చేసింది. “కొత్తగా ఏం చూడాలా? రాత్రి కొత్తగా ఏం కనిపించిందనీ, 34..26..34 అంటూ నలిపి పాడేసారూ?” అన్నా అదే ఉక్రోషంతో. ఆయన నవ్వేసి “అదా…దానికి వేరే కారణం ఉందిలే..” అన్నాడు. “అదే…ఆ కారణమే చెప్పండి.” అన్నా మొండిగా. “అబ్బా…అన్నీ చెప్పుకోగలిగే కారణాలుండవే…పోయి నువ్వు వంట చేసుకో..” అని మళ్ళీ కసిరాడు. ఇక ఆయన దగ్గర ఉండలేక కాళ్ళు టపటపా కొట్టుకుంటూ వంటగదిలోకి పోయాను. వెళ్ళిన పది సెకన్ల లోనే మెసేజ్ వచ్చింది. “ఏం చేస్తున్నావ్ బంగారం?” అని ఉంది. సెల్ ని నేలకేసి కొట్టాలనిపించింది. అంతలోనే తమాయించుకుంటూ “ఏంలేదు…ఖాళీగానే ఉన్నా.” అని మెసేజ్ పెట్టా. “అయితే సరదాకి ఒక ముద్దు పెట్టొచ్చుగా..” అని పంపాడు. “చచ్చినోడా..” అని తిట్టుకున్నా. ఎదురుగా ఇంత అందమైన పెళ్ళాం ఉంటే, కనీసం చూడడానికి మనసు లేదు గానీ, అదెవ్వత్తో, ఎలా ఉంటుందో తెలియని దానిని ముద్దులు అడిగేస్తున్నాడు. ’మగబుద్ది..మగబుద్ది’ అని మళ్ళీ తిట్టుకున్నా. ఇంతలో మళ్ళీ మెసేజ్ వచ్చింది “ఉమ్మా..ఉమ్మా..” అని. కంపరం వచ్చేసి, ఆ సెల్ ను డబ్బాలో పడేసాను. ఎందుకో మళ్ళీ మెసేజ్ రాలేదు. వంట అయ్యేవరకూ బయటకి వినబడకుండా ఏడుస్తూనే ఉన్నాను. వంట కాగానే బయటకు వచ్చి “వంట అయింది, రండి తిందురుగాని.” అన్నా. “ఆఁ..వస్తున్నా స్వప్నా..” అని పైకి లేచి, నన్ను చూసి నాలుక కరచుకొని “అదే..వస్తున్నా నీరూ..” అన్నాడు. “స్వప్న ఎవరూ?” అన్నా సూటిగా చూస్తూ. “అబ్బే…ఎవరూ లేరు.” అన్నాడాయన తడబడుతూ. “ఎవరూ లేకుండా ఆ పేరు మీ నోటి వెంట రాదు. చెప్పండి ఎవరో..” అన్నా గట్టిగా. గట్టిగా అయితే అన్నా గానీ, లోపలనుండి ఏడుపుతన్నుకు వచ్చేస్తుంది. “అబ్బా…ఆ టాపిక్ వదిలేయ్ స్వప్..ఆ అదే నీరూ..” అన్నాడాయన. ఇక అంతే, ఏడవడం మొదలెట్టా. ” ఏయ్..ఏమయిందని ఏడుస్తున్నావ్? ప్లీజ్…ఊరుకో నీరూ..” అన్నాడాయన నా గడ్డాన్ని పట్టుకుంటూ. నేను ఆయన చేతిని విదిలించి కొట్టి “ముందు ఆ స్వప్న ఎవరో చెప్పండి.” అన్నా. “అబ్బా…అలకలో నువ్వు ఎంత ముద్దొస్తావో తెలుసా!” అంటూ నా బుగ్గ పట్టుకోబోతే, మళ్ళీ విదిలించుకొని “ఇది అలక కాదు, కోపం…చెప్తావా, చెప్పవా?” అని అరిచాను. ఆ కోపంలో నేను గమనించలేదు. ఫస్ట్ టైమ్ ఆయనని ఏకవచనంలో సంభోదించడం. నేను అలా అనడం ఆయనకి ఏమనిపించిందో ఏమో, “చెబితే ఇంకా ఏడుస్తావు నీరూ..” అన్నాడు. “పరవాలేదు. చెప్పండి.” అన్నా మొండిగా. “నా లవర్.” చెప్పేసాడు ఆయన. “ఎప్పట్నుండీ?” అన్నాను. “చాలా రోజుల నుంచి” అన్నడాయన. “మ్..బావుంటుందా?” అని అడిగా. ఆయన మొహం లో కొంచెం కూడా నాకు దొరికిపోయానన్న బెదురు కనబడడం లేదు. మండి పోతుంది నాకు. “చెప్పండీ.. ” అన్నా. ఆయన కూల్ గా నా వైపు చూసి “మ్..బావుంటుంది.” అన్నాడు. (అదేంటీ, అసలు కలవలేదు కదా, బావుంటుందీ అని చెప్పేస్తున్నాడేమిటీ? అన్న అనుమానం వచ్చింది.). “అలాగా నాకంటే బావుంటుందా?” అన్నాను. అయన నిర్లక్ష్యంగా తల ఎగరవేస్తూ “యా..నీ కంటే సెక్సీగా ఉంటుంది.” అన్నాడు. నాకేం మాట్లడాలో అర్ధం కావడం లేదు. ఇంతలో ఆయనే అన్నాడు “అసలు నిన్ను వదిలించుకొని, తనని తగులుకుంటే ఎలా ఉంటుందా…అని ఆలోచిస్తున్నా..” అని. ఇక అంతే… ఉక్రోషం, కోపం, మంట, బాధ, ఏడుపూ అన్నీ ఒకేసారి వచ్చేసి మీద కలబడి కొట్టడం మొదలెట్టా. ఆయన ఆ దెబ్బలను కాచుకుంటూ ” ఏయ్ నీరూ..ఆగు..ఆగరా ప్లీజ్.” అంటున్నా వినకుండా కొట్టేస్తున్నాను. ఆయన నా దెబ్బల నుండి కాచుకోడానికి ట్రై చేస్తూ, మొత్తానికి నా చేతులు దొరక పుచ్చుకొని, ” ఇందుకే, నీ కంటే స్వప్నే బెటర్ అనిపించింది.” అన్నాడు. ఆ మాటలకి ఉక్రోషంగా “అసలు నువ్వెప్పుడూ స్వప్నని చూడలేదు.” అన్నా. “నీ మొహం.. రోజూ చూస్తూనే ఉన్నా, కలుస్తూనే ఉన్నా..” అని గట్టిగా కౌగిలించుకొని, నా చెవిలో రహస్యంగా “నువ్వైనా చెప్పు స్వప్నా, మా నీరూకి..” అన్నాడు. ఒక్కక్షణం ఆయన ఏమంటున్నాడో అర్ధం కాలేదు. ఆయన మొహంలోకి చూసాను. చిలిపిగా నవ్వుతున్నాడు. “అంటే..?” అనుమానంగా అడిగా. “నువ్వే స్వప్న అని తెలుసు నాకు. వన్ మినిట్.” అని, తన సెల్ తీసి ఒక పిక్ చూపించాడు. రెస్టారెంట్ లో నేను టేబుల్ కిందకి దూరినపుడు ఆయన సెల్ ని కిందకి దించి పిక్ తీసాడు. అప్పుడే అనిపించించింది నాకు, సెల్ నా వైపు చూస్తూందేమిటా అని. పిచ్చిదాన్ని అయిపోయాను. ఆ ఉక్రోషంలో గబగబా గదిలోకి పోయి, మంచం మీద బోర్లా పడి ఏడవసాగాను. ఆ ఏడుపుకి కారణం నేను ఓడిపోయానన్న ఫీలింగ్. ఆయన వచ్చి, నా వీపుపై నిమురుతూ “బంగారం…అలా ఉడుక్కోకురా…నువ్వు ఎందుకు ఇలా చేసావో నాకు అర్ధమయింది. ఒక రకంగా నువ్వు అనుకున్నది సాధించావ్ తెలుసా..” అన్నాడు. నేను తల తిప్పి ఆయన వైపు చూసాను. “మన లైఫ్ లో ఎగ్జైట్ మెంట్ పోయిందీ అని చాలా సార్లు చెప్పేదానివి, నాకు ఆ ఎగ్జైట్ మెంట్ ఇద్దామనే కదా ఇలా చేసింది?” అన్నాడు. మౌనంగా తల ఊపాను. “మరి నిన్న రాత్రి జరిగింది ఒక సారి గుర్తు తెచ్చుకో..” అన్నాడు. రాత్రి ఆయన చేసిన అల్లరంతా గుర్తొచ్చి, బోలెడు సిగ్గేసి, నా చేతుల్లో మొహాన్ని దాచేసుకున్నాను. “అలా సిగ్గుపడ్డప్పుడు మొహం దాచేస్తే ఎలా? అప్పుడే కదా నువ్వు మరింత ముద్దొస్తావూ..” అంటూ నా చేతులు తొలగించడానికి ప్రయత్నించాడు. నేను చేతులు బిగించేసి మొహం తిప్పుకున్నా. ఆయన నడుము వంపులో చక్కిలిగింతలు పెట్టడం మొదలెట్టాడు. నేను పకపకా నవ్వుతూ , తట్టుకోలేక ఆయన కౌగిలిలో వాలిపోయి ఆయన గుండెల్లో తలదాచుకొని, “అసలు ఆ స్వప్న నేనేనని మీరు ఎలా కనిపెట్టారు?” అని అడిగా. “నువ్వు ఒక తింగరి మాలోకానివి కాబట్టి.” అన్నాడు మురిపెంగా. నేను చురుక్కు మని ఆయన మొహం లోకి చూసా. “అబ్బో..” అని, నా చూపులు ఆయన్ని కాల్చేస్తున్నట్టుగా ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ” చెప్తా కూర్చో..” అని చెప్పడం ప్రారంభించాడు. “ఎవరో స్వప్న అనే అమ్మాయి మెసేజ్ లు చేస్తుంది. ఆమె ఇంటెన్షన్ తెలిసాక, నేను రిప్లయ్ ఇవ్వడం మానేసాను.” అని ఆయన చెప్పగానే నాకు గుర్తొచ్చింది, మొదటి మూడురోజులూ ఆయన రిప్లయ్ ఇవ్వక పోవడం. “మ్..తరువాత?” అడిగాను ఆసక్తిగా. ఆయన నవ్వి “సెల్ కంపనీ నుండి వెరిఫికేషన్ కాల్ వచ్చింది. ఫలానా నంబర్ నీరజ అనే ఆవిడ తీసుకున్నారూ, అవిడ మీ భార్యేనా..అని. కొత్త నంబర్ చెప్పమని అడిగి తీసుకున్నా. ఎక్కడో చూసినట్టు అనిపించి, చెక్ చేస్తే స్వప్న నంబర్ అని తెలిసింది. అంతకు ముందు రోజు నువ్వు తిక్కతిక్కగా బిహేవ్ చేయడం గుర్తొచ్చింది…ఒకటీఒకటీ కలిస్తే రెండు.” ఆయన ఏదో చెప్పబోతుంటే “ఆగండాగండి…అసలు ఆ కంపెనీ వాళ్ళు మీకెందుకు కాల్ చేసారు?” అన్నా. “అందుకే అన్నా…నువ్వు తింగరి మాలోకం అని, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, రిఫరెన్స్ నంబర్ అడిగితే అలవాటులో పొరపాటులా నా నంబర్ ఇచ్చేసావు..” అని పకపకా నవ్వసాగాడు. నేను ఉక్రోషంగా మీద పడ్డా. ఆయన నన్ను ఒడిసి పట్టుకున్నాడు.హలో..ఇక చెప్పడానికి ఏమీ లేవు. మా ఆయనకీ, నాకూ బోలెడు పనులున్నాయ్..బై..బై..సీ యూ..THE END