telugu stories ప్రేమ గీతం 1 గీత నిద్రలే ఇవాళ్ళ ఇంటర్వ్యూ ఉందని చెప్పావు కదా. మొహం మీద దుప్పటి తీసి గడియారం వంక చూస్తుంది గీత. అప్పుడే 6 అయ్యిందా . ఏంటమ్మా నువ్వు త్వరగా నిద్రలేపమని చెప్పాను కదా. ఇంటర్వ్యూ 10కి కదే ఎందుకంత కంగారు . ముందు లేచి స్నానం చేసి రా. సరే . కాసేపటికి గీత రెడీ అయ్యి బయటికి వస్తుంది. అమ్మా నేను వెళ్తున్నా. టిఫిన్ తినేసి వెళ్లు. లేదమ్మా గుడికి వెళ్లాలి లేట్ అవుతుంది. సరే మీ నాన్న కి చెప్పి వెళ్లు. నాన్న కి చెప్పకుండా ఎప్పుడైనా బయటకు వెళ్ళానా నేను. తన తండ్రి శేఖర్ దగ్గరికి వెళ్తుంది గీత. గదిలో వీల్ చైర్ లో కూర్చుని పేపర్ చూస్తున్నాడు. నాన్న నన్ను ఆశీర్వదించండి. ఏమ్మా ఇంటర్వ్యూ కి వెళ్తున్నావా. అవును నాన్న . సరే జాగ్రత్తగా వెళ్లి రా. అలాగే నాన్న. అమ్మా వెళ్ళొస్తాను . సరే. గీత వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతాడు శేఖర్. ఎమయ్యిందండి అలా చూస్తున్నారు. పెళ్లి కావాల్సిన పిల్ల ఇలా ఉద్యోగం పేరుతో కష్టపడుతుంటే భాదగా ఉంది లక్ష్మి . తనకి తోడుగా ఉండవలసిన సమయంలో నేను నడవలేని స్తితిలో తనకి భారంగా ఉండిపోయాను. అలా మాట్లాడకండి గీత ఎప్పుడూ మనల్ని బరువు అనుకోదు భాద్యతగానే చూస్తుంది. అవును లక్ష్మి కానీ మన పిల్లల పెళ్లిళ్లు త్వరగా చేసేయాలి. తన అక్క పెళ్లి ఎలా చెయ్యాలో గీత కి తెలుసు మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోకండి. ఆలోచించడం తప్ప ఇంకేం చెయ్యగలను నేను. అదే వద్దంటున్నా. మీరు పిల్లలకి ఏమీ తక్కువ చెయ్యలేదు. వాళ్ల పెళ్లికి కావాల్సిన డబ్బు కూడా బ్యాంక్ లో దాచారు ఇంకేం చేయాలి . మీరు ఏం ఆలోచించకుండా రండి టిఫిన్ చేద్దురు. సరే . దేవుడా ఎలా అయినా ఈ జాబ్ నాకు వచ్చేలా చూడు. ఏంటి గీత మళ్లీ ఇంటర్వ్యూ కి వెళ్తున్నావా. అవును పూజారి గారు. దేవుడికి నా గురించి కాస్త గట్టిగా చెప్పండి. నాకు దేవుడికి ఇదేమైనా కొత్తా. ఇప్పటికే 4 ఉద్యోగాలు మారావు . ఇలా అయితే ఎలా చెప్పు. పూజారి గారు నాకు జాబ్ అవసరమే అందుకని నా మనసుకి నచ్చని పని చెయ్యను. నాకు తెలుసమ్మా. సరే ఉండు అర్చన చేసి వస్తాను. అలాగే పూజారి గారు. పూజ పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఆటో కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో ఒక కార్ స్పీడ్ గా వెళ్లడం వల్ల గీత మీద బురద పడుతుంది. హేయ్ ఇడియట్ కళ్లు కనిపించడం లేదా. గీత మాటలకి కార్ కొంచెం దూరంలో ఆగుతుంది. ఒక వ్యక్తి కార్ దిగి గీత దగ్గరికి వస్తాడు. వాట్ డిడ్ యు సేయ్. ఏం తెలుగు రాదా కళ్లు కనిపించడం లేదా అన్నాను. అసలు నిన్ను ఇక్కడెవరు నిలబడమన్నారు. కార్ వెళ్లేప్పుడు పక్కకి తప్పుకోవాలి అని తెలియదా. నేను సరైన చోటే నిలబడ్డాను. అయినా ఇలాంటి రోడ్ మీద ఎవరైనా అంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తారా. షెటప్ కార్ ఎలా డ్రైవ్ చెయ్యాలో నువ్వు నాకు చెబుతున్నావా. ప్రణయ్ సార్ గొడవెందుకు వెళదాం రండి. మనకి లేట్ అవుతుంది. నువ్వుండు చారి . మర్యాదగా సారీ చెప్పు . హో సారీ కావాలా వెయిట్. గీత గట్టిగా విజిల్ వేస్తుంది. క్షణాలలో ప్రణయ్ చుట్టూ జనం వస్తారు. అందరూ చిన్న పిల్లలే. ఏంటక్కా విజిల్ వేశావు. ఇతను ఎమైనా అన్నాడా . చెప్పక్కా. చూసావుగా ఇది నా ఏరియా. నేను ఒప్పుకుంటే గానీ ఇక్కడి నుంచి కదలలేవు. ప్రణయ్ కోపంగా గీత దగ్గరికి రాబోతుంటే పిల్లలందరూ రాళ్లు తీసుకుని బెదిరిస్తారు. సార్ పిల్లలతో ఎందుకు గొడవ వెళ్ళిపోదాం రండి. ఎక్కడికి వెళ్ళేది ముందు నాకు సారీ చెప్పి అప్పుడు కదలండి. సార్ తప్పు మనదే కదా సారీ చెప్పేయండి. నేను దీనికి సారీ చెప్పాలా. హెల్లో మర్యాదగా మాట్లాడు . లేకపోతే మర్యాద ఎలా ఉంటుందో రుచి చూపించాల్సి వస్తుంది. మా అక్క చెబుతుంది గా సారీ చెప్పు. సార్ చెప్పేయండి మనకి మీటింగ్ కి టైమ్ అవుతుంది. సరే తప్పు నాదే సారీ. గుడ్ ఇంకెప్పుడూ కార్ స్పీడ్ గా నడపకండి . పిల్లలు సార్ కి దారి ఇవ్వండి వెళ్తారు. పిల్లలు పక్కకి తప్పుకోవడంతో ప్రణయ్, చారి అక్కడి నుండి వెళ్ళిపోతారు. <br>ప్రణయ్ తన కేబిన్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో చారి లోపలికి వస్తాడు. సార్ మీటింగ్.. మర్చిపోయాను చారి వెళదాం రా. అది కాదు సార్ లేట్ అయ్యింది అని డీలర్స్ వెళ్లిపోయారంట. వాట్ . నిజం సార్. ఇదంతా ఆ అమ్మాయి వల్లే . కోట్ల రూపాయల డీల్ చెయ్యి జారిపోయింది. ఆఫ్ట్రాల్ ఒక ఆడది రోడ్ మీద నాతో సారీ చెప్పించుకుంది. వదలి పెట్టను దాన్ని. మొదటి సారి ఒక అమ్మాయి ఈయన్ని ఎదిరించి మాట్లాడింది . బాస్ కచ్చితంగా ఆ అమ్మాయిని వదలరు. చారి మనసులోనే అనుకుంటూ ఉంటాడు. గీత ఏమయ్యింది డ్రెస్ అంతా బురద చేసుకుని వచ్చావు. కావాలని ఎవరైనా బురదలో పడతారా అమ్మా . గుడి దగ్గర అతనెవరో కార్ స్పీడ్ గా నడిపాడు దాంతో బురద నా మీద పడింది. అంటే ఇంటర్వ్యూ కి వెల్లలేదా. లేదు ఇలా ఎలా వెళ్లను పైగా టైమ్ కూడా అయిపోయింది. సరే ముందు స్నానం చేసి రా . అలాగే . గదిలో ఉన్న శేఖర్ కి గీత మాటలు వినిపించి బయటికి వస్తాడు. గీత ఏమయ్యింది. గీత గుడి దగ్గర జరిగిన సంఘటన వివరంగా చెబుతుంది. బాగా బుద్ది చెప్పావు లేకపోతే నా కూతురితోనే పెట్టుకుంటాడా. ఏంటండీ మీరు పిల్లలకి ఇలా ఎవరైనా చెబుతారా. గీత అసలు ఎందుకే నీకు గొడవలు . డబ్బున్న వాళ్ళతో గొడవ అయినా స్నేహం అయినా చాలా ప్రమాదకరం. అమ్మా నువ్వు పాత చింతకాయ పచ్చడి లా మాట్లాడకు . తప్పు చేసింది అతను. కరెక్ట్ గా చెప్పావు గీత మీ అమ్మ అలానే అంటుంది నువ్వేం పట్టించుకోకు. అలానే దాన్ని గారాబం చెయ్యండి . బొత్తిగా భయం లేకుండా పోయింది దీనికి. ఎమయ్యిందమ్మా గీత ని తిడుతున్నావు. సత్య లోపలికి వస్తూ అడుగుతుంది. నీ చెల్లెల్నే అడుగు ఏం చేసిందో . కోపంగా కిచెన్ లోకి వెళ్లిపోతుంది లక్ష్మి. గీత వైపు చూస్తుంది సత్య . నాన్న అక్కకి విషయం చెప్పు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే గీత వెళ్లు. <br>ఆరోజు రాత్రి గీత పేపర్ చూస్తూ ఉంటుంది. గీత ఇంకా నిద్రపోలేదా. లేదు నాన్న జాబ్ ప్రకటనలు ఏమైనా ఉన్నాయేమో అని వెతుకుతున్నా. లేట్ అవుతుంది గీత వెళ్లి నిద్రపో. మీరు వెళ్ళండి నాన్న నాకు నిద్ర రావడం లేదు. సరే త్వరగా నిద్రపో. అలాగే నాన్న. @@@@@@@@ ఒక ఇంటర్వ్యూ కి అటెండ్ అవుతుంది గీత . ఇంటర్వ్యూ అయిన తర్వాత బయట వెయిట్ చెయ్యమని చెప్పడంతో అందరితో పాటు బయటే కూర్చుని ఉంటుంది. ఇంతలో ప్రణయ్ ఆఫీస్ లోపలికి వస్తూ కనిపిస్తాడు . ప్రణయ్ కి కనబడకుండా ఫైల్ అడ్డు పెట్టుకుని పక్కకి వచ్చేస్తుంది. ఇతనేంటి ఇక్కడ కొంపదీసి ఈ ఆఫీస్ ఇతనిదేనా. అనుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్లి ప్రణయ్ గురించి అడుగుతుంది. ఎక్ష్యూజ్ మి ఇప్పుడు లోపలికి వెళ్లారే ఆయన ఎవరు. ప్రణయ్ సార్ ఈ కంపెనీ MD మేడమ్. చచ్చాను ఇంకేం వస్తుంది నాకు ఈ జాబ్ వెళ్ళిపోవడమే మంచిది. ఒకే థ్యాంక్ యు. అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది. ఆటో లో ఇంటికి చేరుకుంటుంది. అమ్మా కాస్త టీ ఇవ్వు. లక్ష్మి టీ తెచ్చి గీత చేతికి ఇస్తుంది. ఇంటర్వ్యూ ఏమయ్యింది గీత. జాబ్ నాకు రాదమ్మా అందుకే వచ్చేశాను. అదేంటి. మొన్న గుడి దగ్గర గొడవైందని చెప్పాను కదా అతనిదే ఆ ఆఫీస్ . అందుకే చెప్పాను అందరితో గొడవ పెట్టుకోవద్దని. అమ్మా వదిలేయ్ . ఇంతలో గీత ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన తర్వాత సంతోషం తో తల్లి ని హత్తుకుంటుంది . ఏమయ్యింది గీత. అమ్మా నాకు జాబ్ వచ్చింది. అవునా మరి అతను నీతో గొడవ పడ్డాడని చెప్పావు. జాబ్ ఎలా ఇచ్చాడు. ఎలా అయితే ఏముంది వచ్చింది కదా. రేపే జాయిన్ అవ్వమని చెప్పారు. మంచి విషయం చెప్పావు. ఉండు నీ నోరు తీపి చేస్తాను. కిచెన్ లోకి వెళ్లి పంచదార తెచ్చి గీత నోటిలో వేస్తుంది. @@@@@@@@ మరుసటి రోజు గీత ఆఫీస్ కి వెళుతుంది. రిసెప్షన్ లో అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకుని మేనేజర్ గదికి వెళుతుంది. ఎక్ష్యూజ్ మి సార్. యస్ కమ్ ఇన్. నమస్తే సార్ నా పేరు గీత. కూర్చోండి గీత. థ్యాంక్ యు సార్ నా సర్టిఫికేట్స్. మేనేజర్ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేస్తాడు. ఒకే మిస్ గీత అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఈ ఇన్సూరెన్స్ పేపర్స్ పై సంతకం పెట్టండి. ఇన్సూరెన్స్ ఏంటి సార్. కంపెనీ తరపున మీ ఫ్యామిలీ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం . చాలా మంచి విషయం సార్. ఇటివ్వండి సంతకం పెట్టి ఇస్తాను. సంతకం పెట్టిన తర్వాత పేపర్స్ మానేజర్ కి ఇచ్చేస్తుంది. ఒకే రండి మీ కేబిన్ చూపిస్తాను. సరే సార్. గీత ని తన కేబిన్ కి తీసుకువెళ్తాడు మానేజర్. గీత ఇదే మీ కేబిన్ . వర్క్ లో ఏమైనా డౌట్స్ వస్తే పక్కనే ఉన్న శైలజ గారిని అడగండి . ఒకే సార్. ఒకే కారియాన్ యువర్ వర్క్. మానేజర్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. రెండు రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయింది గీత కి . @@@@@@@@@ ప్రణయ్,చారి కార్ లో ఇంటికి బయలుదేరుతారు. సార్ మీకో విషయం తెలుసా . చెప్పకుండా ఎలా తెలుస్తుంది చారి . గుడి దగ్గర మీతో గొడవ పడిందే ఆ అమ్మాయి మన ఆఫీస్ లోనే జాయిన్ అయ్యింది సార్. తెలుసు తనని సెలెక్ట్ చేసింది నేనే కదా. కానీ ఇంటర్వ్యూ చేసింది మన మానేజర్ కదా సార్. అవును ఆరోజు నన్ను ఆఫీస్ లో చూసి తను బయటికి వెళ్లిపోయింది అప్పుడే నేను తనని చూసాను. ఫోన్ చేయించి జాబ్ లో జాయిన్ అయేలా చేసాను. మీది ఎంత మంచి మనసు సార్. ఆ అమ్మాయికి జాబ్ ఇచ్చారా. ఎక్కువ ఫీల్ అవ్వకు చారి . నేను రివెంజ్ తీర్చుకోవడానికే తనకి జాబ్ ఇచ్చాను. లేకపోతే రోడ్ మీద అందరి ముందు నాతో ఆడుకుంటుందా. చారి ఆశ్చర్యంగా ప్రణయ్ ని చూస్తాడు. ఇప్పుడు తెలుస్తుంది దానికి ఈ ప్రణయ్ అంటే ఏమిటో. కానీ సార్ ఆ అమ్మాయి జాబ్ మానేసి వెళ్లిపోతే ఏం చేస్తారు. నేను అంత తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా చారి . వన్ ఇయర్ అగ్రిమెంట్ మీద సైన్ చెయ్యించాను. చచ్చినట్టు నా దగ్గర పనిచెయ్యాల్సిందే. అంత చిన్న గొడవకి ఇంత పెద్ద రివెంజ్ ప్లాన్ అవసరమా సార్. అవసరమే మొదటి సారి ఒక ఆడది నన్ను ఎదిరించి మాట్లాడడమే కాకుండా నాతోనే క్షమాపణ చెప్పించింది. అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను. వామ్మో ఈయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి చారి సైలెంట్ అయిపోయావు నాతో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నావా. సార్ మీకెలా తెలిసింది. ఫేస్ చూస్తే ఎదుటి వాళ్ల మనసులో ఏముందో నాకు అర్దం అయిపోతుందిలే. ఇంతలో ఇంటికి చేరుకుంటారు. చారి ఉదయాన్నే త్వరగా వచ్చేయ్. సరే సార్. చారి వెళ్లిన తర్వాత ప్రణయ్ ఇంటి లోపలికి వెళతాడు. ప్రణయ్ వచ్చేశావా నాయనమ్మ నిన్ను రమ్మని చెప్పింది వెళ్లు. ఫ్రెష్ అయ్యి వస్తాను అభి నాయనమ్మ కి చెప్పు. సరే . అని అభి వాళ్ల నాయనమ్మ గదికి వెళ్తాడు. అభి మీ అన్నయ్య వచ్చాడా . హా వచ్చాడు నాయనమ్మ . ఫ్రెష్ అయ్యి నీ దగ్గరికి వస్తా అన్నాడు. సరే . ప్రణయ్ తో ఏం మాట్లాడాలి నాయనమ్మ. మన చిన్నా పుట్టినరోజు వస్తుంది కదా ఆ ఏర్పాట్ల గురించి మాట్లాడాలి. నాయనమ్మ లాస్ట్ టైమ్ ఇలానే పార్టీ ఏర్పాటు చేస్తే చిన్నా ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు. అప్పుడు మనం ఎంత కంగారు పడ్డాం మళ్లీ అవసరమా. చిన్న పిల్లాడురా వాడు . ఆడుకోవాల్సిన వయసులో ఇలా మౌనంగా ఉండి పోతున్నాడు. పార్టీ లో పిల్లల్ని చూసి అయినా వాడు మారతాడని చిన్న ఆశ. ప్రణయ్ లోపలికి వస్తాడు. నాయనమ్మ పిలిచావా. అవును ప్రణయ్ ఇలా వచ్చి కూర్చో. బామ్మ పక్కనే కూర్చుంటాడు . మన చిన్నా పుట్టినరోజు పార్టీ గురించి మాట్లాడుదాం అని రమ్మన్నాను. నేను ఆల్రెడీ ఈవెంట్ మానేజర్ తో మాట్లాడాను . అతను వచ్చి మిమ్మల్ని కలుస్తాడు నాయనమ్మ . నీకు అన్నీ మీ తాత పోలికలే వచ్చాయి రా. నా మనసులో ఏముందో చెప్పకుండానే తెలుసుకుంటావు నువ్వు. తాతయ్య గురించి మాట్లాడుతుంటే నాయనమ్మ మొహంలో ఒక గ్లో వస్తుంది ప్రణయ్ ఎందుకంటావు. నువ్వు కూడా ఒక మనిషిని మనస్పూర్తిగా ప్రేమిస్తే అప్పుడు అర్దం అవుతుంది అభి. అని చెబుతుంది బామ్మ. అమ్మో నాకు అంత ఓపిక లేదు. ఈ కాలం అమ్మాయిల్ని డీల్ చెయ్యడం నావల్ల కాదు . అలా అంటావేంట్రా . నిజం నాయనమ్మ బయట అమ్మాయిలు రెబల్స్ లా తయారయ్యారు. కావాలంటే ప్రణయ్ ని అడుగు . ప్రణయ్ ఉలిక్కిపడి అభి వైపు చూస్తాడు. అదేంటి ప్రణయ్ అలా చూస్తున్నావు . నీకు ఆల్రెడీ అనుభవం అయ్యింది కదా. గుడి దగ్గర ఎవరో అమ్మాయి నీతో గొడవ పడిందంట కదా. నీకెలా తెలుసు. చారి చెప్పాడు. ఇంతకీ ఎవరా అమ్మాయి. అదొక పిచ్చిది దాని గురించి ఇప్పుడు అవసరమా . ప్రణయ్ కోపంగా బయటికి వచ్చేస్తాడు. అభి ఏమయ్యింది వాడికి అలా చిరాకు పడుతున్నాడు. ఏం లేదు నాయనమ్మ నీ మనవడిని మొదటి సారి ఒక ఆడపిల్ల ఎదిరించి మాట్లాడింది కదా అందుకే అంత కోపం . అలాంటి అమ్మాయిలు చాలా రేర్ గా ఉంటారు అభి . వాళ్ల ఆత్మాభిమానం ముందు డబ్బు పరపతి ఏదీ నిలబడలేదు. అవును నాయనమ్మ . ఇప్పటి వరకూ ప్రణయ్ కి ఎదురుపడిన అమ్మాయిలందరూ తన డబ్బు హోదా చూసి స్నేహం చెయ్యాలి అని అనుకున్నవారే. కానీ ఈ అమ్మాయి మాత్రం డిఫెరెంట్. సరేలే వాడు అసలే కోపంగా ఉన్నాడు . నువ్వు ఆ అమ్మాయి గురించి వాడి దగ్గర ఏం మాట్లాడకు. అర్దం అయ్యిందా. సరే నాయనమ్మ . నాకు నిద్రొస్తుంది వెళ్తాను. సరే . అభి బయటికి వచ్చేసరికి ప్రణయ్ చిన్నా గది నుండి బయటికి వస్తూ కనిపించాడు. ప్రణయ్ చిన్నా నిద్రపోయాడా. హా పడుకున్నాడు. చిన్నా గురించి ఆలోచిస్తే భాదగా ఉంటుంది ప్రణయ్. వచ్చే నవరాత్రి ఉత్సవంలో అయినా వాడు మనతో కలిసి హారతి ఇస్తే బాగుంటుంది. వాడు కూడా ఈ ఇంటి వారసుడే అయినా కూడా ప్రతీసారి మనిద్దమే హారతి ఇస్తున్నాము. తప్పకుండా చిన్నా లో మార్పు వస్తుంది అభి. ఆ నమ్మకం నాకుంది. వాడు మాములు మనిషి అవ్వడానికి ప్రపంచంలో ఎక్కడికైనా సరే వెళ్తాను. ఇండియాలోనే కాకుండా ఫారిన్ లో ఉన్న టాప్ మోస్ట్ సైకియాట్రిస్ట్ లు అందరూ వాడిని ట్రీట్ చేసారు కానీ చిన్నా లో ఎలాంటి మార్పు రాలేదు. అభి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చిన్నా ని నేను చూసుకుంటాను నువ్వెళ్ళు. సరే ప్రణయ్ గుడ్ నైట్. గుడ్ నైట్ అభి. అభి వెళ్లిన తర్వాత
కథను కొనుగోలు చేయండి