telugu stories ప్రేమ గీతం 3 ఏంటిది ఆఫీస్ అనుకుంటున్నారా లేదా మార్కెట్ అనుకుంటున్నారా. లంచ్ అవర్ దాటి చాలా సమయం అయ్యింది అయినా కూడా మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు. అందరూ సైలెంట్ గా ఉండిపోయారు. ఇలా సైలెంట్ గా ఉన్నారంటే అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సార్ ఇందులో వాళ్ల తప్పేమీ లేదు. మీరు లేరు కదా అని నేనే వాళ్లని కాసేపు ఉండమని చెప్పాను. గీత మాటలకి అందరూ షాక్ అవుతారు. నిజానికి తను ఆఫీస్ కి వెళదాం అంటే వాళ్లే ఫోర్స్ చేసి గీత ని కూడా ఉండమన్నారు. నాకు తెలుసు ఇదంతా నీ పనే అని. అసలేమనుకుంటున్నావు. నీ వల్ల నా స్టాఫ్ అందరూ పాడైపోతున్నారు. చూడు గీత నీ లిమిట్స్ లో నువ్వు ఉండడం నేర్చుకో. గీత తల దించుకుని ఉండిపోయింది. ప్రణయ్ స్టాఫ్ అందరి వైపు తిరుగుతాడు. తనకంటే బుద్ది లేదు మీకేమైంది . ఇంతకు ముందు ఎప్పుడూ మీరిలా ప్రవర్తించలేదు. మరి ఇప్పుడేందుకు ఇలా చేస్తున్నారు. సారీ సార్ ఇంకోసారి ఇలా జరగదు. ఒకే వెళ్లి పని చూసుకోండి. అందరూ వెళ్ళిపోతారు . కాసేపటికి ప్రణయ్ కేబిన్ కి వస్తుంది గీత. ఒక లెటర్ తీసి ప్రణయ్ చేతిలో పెడుతుంది. ఏంటిది. నా రాజీనామా లెటర్. నాకు తెలుసు ప్రతీసారి మీరు కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు. కరెక్ట్ గా అర్దం చేసుకున్నావు గీత. ఇప్పుడు తెలిసిందా నీకు ప్రణయ్ అంటే ఏమిటో. మరీ ఎక్కువ ఆనంద పడకండి నేను జాబ్ మానేస్తున్నా. నీకా ఛాన్స్ లేదు గీత . వన్ ఇయర్ నీకు నచ్చినా నచ్చకపోయినా నా దగ్గర జాబ్ చేయాల్సిందే. గీత అర్దం కానట్టుగా చూస్తుంది. ప్రణయ్ అగ్రిమెంట్ పేపర్స్ తీసి గీత చేతికి ఇస్తాడు. వన్ ఇయర్ ఇక్కడే
కథను కొనుగోలు చేయండి