మనసు మాట వినదు 1 – Telugu sex stories

telugu stories మనసు మాట వినదు 1 సిటీ హాస్పటల్………… ఐసీయూ నుండి బయటికి వచ్చాడు . డాక్టర్ ని చూడగానే ఒక మధ్య వయసు వ్యక్తి ఆతృతగా దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ పేషెంట్ కండిషన్ వివరించడంతో ఆలోచిస్తూ అక్కడే ఉండి పోయాడు …………… సార్… పేషెంట్ స్పృహలోకి వచ్చారు . నర్స్ చెప్పడంతో ఆ వ్యక్తి లోపలికి వెళ్లాడు . రంజిత్ ….. ఎలా ఉంది. ఒకే……  ఎప్పుడు డిశ్చార్జి చేస్తా అన్నారు . ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది. ఇప్పుడు కూడా ఆఫీస్ గురించే ఆలోచిస్తావా……. చూడు నీ హెల్త్ కండిషన్ ఏం బాలేదు. ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదని డాక్టర్ వార్న్ చేశారు. అలా అంటే ఎలా ……. అయామ్ ఒకే మూర్తి . నో ……. నేను ఛాన్స్ తీసుకోలేను . నీ కూతురికి ఫోన్ చేశాను. తను బయల్దేరి వస్తుంది . ఇకనుండి ఆఫీస్ వ్యవహారాలు అన్నీ తనే చూసుకుంటుంది. చిన్నపిల్ల తనకి ఇంత పెద్ద భాద్యత అప్పగించడం కరెక్ట్ కాదు. పైగా కంపెనీ షేర్స్ కోసం కొన్ని రాబందులు కాచుకుని కూర్చున్నాయి . ఇలాంటి పరిస్థితుల్లో తనకి కంపెనీ హ్యాండ్ ఓవర్ చేయడం …. వేరే దారి లేదు రంజిత్… నువ్వు నెగ్లెట్ చేస్తే నీ ప్రాణానికే ప్రమాదం . నువ్వు టెన్సన్ పడకు. తను  మ్యానేజ్ చేయగలదు. రంజిత్ ఆలోచిస్తూ ఉండి పోయాడు . మూర్తి తన చేతిని పట్టుకుంటాడు . అర్దం చేసుకో రంజిత్ .. అయినా ఎప్పటికి అయినా తనేగా  ఇవన్నీ చూసుకోవాల్సింది . అదేదో ఇప్పటి నుంచే చూసుకుంటుంది . సరే…… నీ ఇష్టం… గుడ్…. నువ్వు రెస్ట్ తీసుకో….. ఎయిర్ పోర్ట్ కి కార్ పంపించి వస్తాను . ఒకే…….. @@@@@@@@ ఫోన్ రింగ్ అయిన సౌండ్ విని వాష్ రూమ్ నుండి బయటికి వస్తాడు శక్తి . నంబర్ చూడగానే నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హాయ్ డార్లింగ్ …. ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు గుర్తొచ్చానా…  రేయ్…. సన్నాసి …. ముందు నేను చెప్పేది విను. ఇవాళ్ళ శనివారం గుర్తుంది కదా… గుర్తుంది డార్లింగ్ ….. రెడీ అవుతున్నా…  మర్చిపోకు …. 108 ప్రదక్షిణలు చేయాలి . బద్దకంతో ప్రదక్షిణలు చెయ్యకుండా చేశానని చెప్పావో …….. తాట తీస్తా .  నా సంగతి తెలుసు కదా. అబ్బా……. చంపకే…  చేస్తానులే…  సరే…. త్వరగా రెడీ అయ్యి వెళ్ళు. అలాగే… నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను ఆ పనిలో ఉంటా.. ఫోన్ కట్ చేసి గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి బైక్ మీద గుడి దగ్గరకి చేరుకుంటాడు.  ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత నీరసంగా గుడి ఆవరణలోనే కూలబడ్డాడు . వామ్మో…… ప్రదక్షిణలు చెయ్యడం చాలా కష్టం. అనవసరంగా నా డార్లింగ్ కి మాటిచ్చాను . ఇంకా 6 శనివారాలు చేయాలి . రేయ్ శక్తి నీ పని ఔట్ రా….. బాబు ప్రసాదం తీసుకోండి . థ్యాంక్స్ పూజారి గారు. బ్రేక్ ఫాస్ట్ కూడా చేయలేదు . ఆకలి దంచేస్తుంది . కొంచెం ఎక్కువ పెట్టండి . మొత్తం నీకే పెడితే మిగిలిన వాళ్ళకి ఏం పెట్టాలి . ప్రసాదాన్ని ప్రసాదంలానే తినాలి . శక్తి చేతిలో ప్రసాదం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పూజారి. చేతిలో ఉన్న ప్రసాదం వైపు చూస్తూ నోట్లో వేసుకుంటాడు . అమ్మో ఆఫీస్ కి లేట్ అవుతుంది. బయటికి వచ్చి బైక్ మీద ఆఫీస్ కి బయలుదేరుతాడు. ………………… హేయ్ శక్తి…. ఊరి నుండి ఎప్పుడొచ్చావు . నిన్న సాయంత్రమే వచ్చానురా.. ఇప్పుడు మీ నాయనమ్మ ఆరోగ్యం ఎలా ఉంది. సూపర్ గా ఉంది. నేను పక్కనుంటే ఆ యముడితో గొడవపడి అయినా సరే వెనక్కి వచ్చేస్తుంది నా డార్లింగ్ . ఇద్దరూ నవ్వుకుంటూ ఎవరి సీట్ లో వాళ్ళు కూర్చుంటారు . అయినా రేపు సన్ డేయ్… ఎలాగో ఆఫీస్ సెలవు కదా… మన్ డేయ్ నుంచి ఆఫీస్ కి రావాల్సింది . ఇప్పటికే వన్ మంత్ పైనే లీవ్ పెట్టాను . అయినా ఫ్లాట్ లో కూర్చుని చేసేదేముంది. అందుకే వచ్చేసా…….. ఒకే ఒకే… ఈవెనింగ్ పార్టీ ఉంది. మిస్ చెయ్యొద్దు . సారీ రా… ఇంకో శిక్ష్ వీక్స్ వరకు నేను ఏ పార్టీకి రాలేను . అదేంటి . మా నాయనమ్మ నాకోసం వెంకటేశ్వరస్వామికి  మొక్కుకుంది. ఆ మొక్కు తీర్చడానికి వెళ్లే కాలు ఫ్రాక్చర్ చేసుకుంది.  డాక్టర్ చెప్పినా సరే వినిపించుకోవడం లేదని ఆ మొక్కు నేను చెల్లిస్తానని నా డార్లింగ్ కి మాటిచ్చాను. అంటే ఇప్పుడు గుడికి వెళ్ళి వచ్చావా..  అవును . సరిపోయింది . సరే…. నువ్వు రానప్పుడు నేను వెళ్ళి చేసేదేం ఉంది. శక్తి నవ్వుతూ పక్కకి తిరిగి చూసేసరికి ఆఫీస్ ఎంట్రన్స్ లో హడావిడిగా కనిపించింది .  బాలాజీ ఆ హడావిడి ఏంటి…….. అదేరా…….. మాలిక్ తెలుసుగా … హా తెలుసు .. వాడికి ఇవాళ్ళ మన ఎండీతో  మీటింగ్ ఉంది. వాడితో మీటింగ్ ఏంటి… వాడో పెద్ద రౌడీ కదా..  హా…. అందుకే ఏం జరుగుతుందో అని  మన కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ భయపడుతున్నారు . పాపం ఎండీ గారు ఎలా డీల్ చేస్తారో ఏంటో.. మన బాస్ సంగతి తెలుసు కదా… అంత ఈజీగా వాడిని ఈ కంపెనీ షేర్స్ ని వాడికి దక్కనివ్వరు . నీకు అసలు విషయం తెలియదు కదా…… రంజిత్ గారు హాస్పటలైజ్ అయ్యారు . వాట్… నాకెందుకు చెప్పలేదు. ఫోన్ చెయ్యొచ్చు కదరా…….. నేను ఫోన్ చేసాను . మీ నాయనమ్మ ఫోనెత్తి నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బండ బూతులు తిట్టింది .   సెలవుల్లో కూడా వాడిని ప్రశాంతంగా ఉండ నివ్వరా అని….. హో….. నాయనమ్మ అంతేలే…. ఇంతకీ మీటింగ్ ఎవరు అటెండ్ చేస్తున్నారు . ఇప్పుడు ఆయన కూతురు ఐశ్వర్య గారు   ఆ భాద్యతలు తీసుకున్నారు .  ఆవిడ వాడిని  ఎలా డీల్ చేస్తుందో అని అందరూ కంగారు పడుతున్నారు . శక్తి ఆలోచిస్తూ ఉండి పోయాడు .  మీటింగ్ హాల్ లో ఐశ్వర్యతో పాటు కంపెనీ షేర్ హోల్డర్స్, పార్ట్ నర్స్ అందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళ ఎదురుగా మాలిక్ ఉన్నాడు . అందరి గుండెల్లోని భయం …. కానీ పైకి కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు . ఏంటి మేడమ్……. డీల్ కి ఒప్పుకున్నట్టే కదా….. ఐశ్వర్య అక్కడ ఉన్న అందరి వైపు చూస్తుంది . ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు మేడమ్ ….. అలాగే మీకు కూడా ఉండకూడదు. అంటే…. ఉండదు అని చెబుతున్నా …..  అదేదో మీ నోటితోనే చెబితే బాగుంటుంది.  గట్టిగా ఊపిరి తీసుకుని మాలిక్ వైపు చూస్తుంది . మిస్టర్ మాలిక్……   సారీ మీ ప్రపోజల్ ని నేను ఎక్షేప్ట్ చెయ్యడం లేదు.  మీరిక వెళ్ళొచ్చు . మీ ఒక్కరి మాటే చెల్లదు ఐశ్వర్య గారు . మిగిలిన షేర్ హోల్డర్స్ అందరూ ఆల్రెడీ ఒప్పుకున్నారు . సీ….. మిస్టర్ …….  ఈ కంపెనీలో 60 పర్సెంట్ షేర్స్ నా పేరు మీదే ఉన్నాయి . వాళ్ళు ఒప్పుకున్నా ఉపయోగం లేదు. నేను అంగీకరిస్తేనే మీరు ఈ కంపెనీలో భాగం కాగలరు . కానీ అది ఎప్పటికి జరగదు . జరగనివ్వను . యూ కెన్ గో నవ్…….. మిస్ ఐశ్వర్య….. బాగా ఆలోచించుకోండి. నాతో వైరం మీకు అంత మంచిది కాదు. జష్ట్ లీవ్ దిస్ ప్లేస్….. మాకు చాలా పనులున్నాయి. కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య పైకి లేచి కోపంగా అందరి వైపు చూస్తుంది . మీరందరూ ఎందుకిలా చేశారు . ఏం జరిగినా నేను చూసుకుంటానని చెప్పాను కదా…  మరెందుకు వాడి ప్రపోజల్ ని ఒప్పుకున్నారు . క్షమించండి మేడమ్ …. వాడు చాలా డేంజరస్ పర్సన్.. అందుకే……. ఇలా ప్రతీ వాడికి భయపడితే మనం బిజినెస్ చెయ్యలేం .  ఈ కంపెనీకంటూ కొన్ని ఎతిక్స్ ఉన్నాయి . ఇలాంటి వాడు కంపెనీలో అడుగు పెడితే అవన్నీ నాశనం అవుతాయి . ఆ విషయం మీకు తెలియదా …. లేదు మేడమ్ …. నాన్న గారు ఉంటే వాడిని ఈజీగా డీల్ చేసి ఉండేవారు . మీరు వాడిని డీల్  చెయ్యగలరో లేదో అని భయపడ్డాం . మీరు అలాంటి భయాలేం పెట్టుకోకండి . ఆయనంత కాకపోయినా నేను కూడా బాగానే డీల్ చెయ్యగలను.  ఇంకెప్పుడూ నాకు తెలియకుండా మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి వీళ్లేదు . అర్దం అయ్యిందా… ఒకే మేడమ్…. ఒకే…. వెళ్ళండి. అందరూ మీటింగ్ హాల్ నుండి బయటకు వెళ్లిపోతారు . ఐశ్వర్య తన క్యాబిన్ లోకి వెళ్ళి  ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో మూర్తి లోపలికి వస్తాడు . ఐశ్వర్య…. అంకుల్ కూర్చోండి . నవ్వుతూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటాడు. ఎలా ఉంది ఎండీ సీట్…… పులి మీద సవారీలా ఉంది అంకుల్…… ఈ ప్రెజర్ వల్లేనేమో డాడీ ఆరోగ్యం పాడయింది. అవును… అందుకే యూ ఎస్ నుండి నిన్ను రప్పించాల్సి వచ్చింది . ఇక్కడ జరిగేవి ఏవీ రంజిత్ కి తెలియనివ్వకు . అలాగే అంకుల్…….  కానీ …. ఐశ్వర్య………  మీ డాడీలా చెయ్యగలనా లేదా అని మాత్రం ఆలోచించకు .  మీ డాడీకన్నా బాగా చేస్తున్నావు . ఈరోజు ఆ మాలిక్ తో డీల్ చేసిన విధానం చూస్తేనే ఆ  విషయం అర్దం అవుతుంది. మన షేర్ హోల్డర్స్ అందరూ చాలా పొగుడుతున్నారు నిన్ను.  థ్యాంక్స్ అంకుల్…. వెళ్దామా…. ఒకే…. మీరు బయట వెయిట్ చెయ్యండి నేను ఒక మెయిల్ పంపించి వస్తాను . ఒకే….. ………………. రేయ్……. మొక్కు మీ నాయనమ్మది, తీర్చాల్సింది నువ్వు నన్నెందుకురా ఇలా టార్చర్ చేస్తున్నావు . పర్లేదురా ప్రదక్షిణలు చెయ్యడం మంచిదే … నాకు మంచి భార్య రావాలని నా డార్లింగ్ మొక్కుకుంది . నువ్వు కూడా చేసావనుకో నీకు మంచి భార్య దొరుకుతుంది. చా………. గుడి చుట్టూ తిరిగిన్నంత మాత్రాన నీకు కాబోయే భార్య వచ్చి నీ ఎదురుగా నిలబడుతుందా.. ఏమో….. నిలబడొచ్చేమో…. ఎవరికి తెలుసు …… ఇంకోసారి నీతో గుడికి వస్తే చెప్పు తీసుకుని కొట్టరా…. రేయ్…..  బాలాజీ ఎక్కడికి …. ఇక నావల్ల కాదురా బాబు …… నేను ఇక్కడే కూర్చుంటా…. నువ్వు ప్రదక్షిణలు ముగించుకుని రా….. ఇలా బద్దకంతో సగంలో ఆపేస్తే నీకే నష్టం… అలా భయపెట్టకురా…. అయినా నేనేం మొక్కుకోలేదు కదా…. ఏం కాదులే నువ్వెళ్ళు.. సరే… నీ ఇష్టం… ప్రదక్షిణలు చేస్తూ గుడి ముందుకి వస్తాడు . దేవుడి విగ్రహం వైపు చూసి  నమస్కరిస్తూ ముందుకి నడిచేసరికి కాలికి ఏదో అడ్డు పడడంతో స్లిప్ అయ్యి ఎదురుగా ఉన్న అమ్మాయి మీద పడబోతూ బ్యాలెన్స్ చేసుకుని  కింద పడబోతున్న ఆ అమ్మాయిని నడుం పట్టుకుని ఆపుతాడు .  హమ్మయ్య పడిపోలేదు…  అనుకుంటూ ఆ అమ్మాయి వైపు చూస్తాడు. చున్నీ మొహన్ని కప్పేయడంతో రెండో చేతితో చున్నీని మొహం మీద నుండి తీసి ఆ అమ్మాయిని చూస్తూ ఉండి పోయాడు.  కోపంగా చూస్తూ శక్తిని దూరంగా తోస్తుంది . తనని చూస్తూనే రెండు అడుగులు వెనక్కి వేసి ఆగిపోతాడు . చున్నీ అతని చేతిలోనే ఉండి పోవడంతో దగ్గరికి వెళ్లి తీసుకోడానికీ ప్రయత్నిస్తుంది . చున్నీని గట్టిగా పట్టుకుని నవ్వుతూ తన వైపు చూస్తూ ఉన్నాడు . ఎక్ష్యూజ్ మి………. నా చున్నీ  ఇవ్వండి . హో…. సారీ తీసుకోండి . ఆ అమ్మాయి చున్నీ తీసుకుని వెళ్ళబోతూ శక్తి పిలవడంతో వెనక్కి తిరిగి చూస్తుంది .  చాలా థ్యాంక్స్….. థ్యాంక్స్ ఎందుకు…. మీరు ఈ గుడికి వచ్చి మా నాయనమ్మ మొక్కుకి అర్దం కల్పించినందుకు . మా నాయనమ్మ నిజమైన భక్తురాలు అందుకే ఆవిడ మొక్కుకోగానే తీర్చేసాడు ఆ దేవుడు . వాట్….. ఏం మాట్లాడుతున్నారు . మీరు మళ్ళీ నాకు కనిపిస్తారు కదా అప్పుడు చెబుతాను . శక్తి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.  ఆ అమ్మాయి అయోమయంగా చూస్తూ ఉండి పోయింది. బాలాజీ….. వెళదాం రా… అయ్యాయా నీ ప్రదక్షిణలు …  హుమ్… అయిపోయాయి . ఇద్దరూ బైక్ మీద బయలుదేరుతారు. శక్తి మొబైల్ రింగ్ అవడంతో బైక్ పక్కకి ఆపి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. శక్తి…. గుడికి వెళ్లావా… వెళ్ళాను డార్లింగ్ …. నీ మొక్కుబడి త్వరలోనే నెరవేరబోతుంది . ఏంటి … నిజం డార్లింగ్ ….. ఈరోజు గుడిలో ఒక అమ్మాయిని చూశాను. ఫుల్ వైట్  డ్రెస్ లో అచ్చం దేవకన్యలా ఉంది. నేను ఫిక్ష్ అయిపోయా…. ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటా …. ఎవర్రా ఆ అమ్మాయి . ఏమో….  గుడిలో చూశాను. హుమ్… ఎవరో ఏమిటో తెలియదు పెళ్ళి చేసుకుంటావా…   రాసిపెట్టి ఉంటే ఆ అమ్మాయే నాకు ఎదురుపడుతుంది డార్లింగ్ … డోంట్ వర్రీ …. పోరా….. నీకు ఏ అమ్మాయి నచ్చినా తననే పెళ్ళి చేసుకుంటా అని చెబుతావు  . ఇప్పటి వరకు ఎన్నిసార్లు చెప్పుంటావు. ఈ అమ్మాయి మాత్రం కన్ఫామ్ ….. ఎందుకంటే నీ దేవుడేగా చూపించింది . ఏడ్చావులే…… ఒక విషయం గుర్తు పెట్టుకో అమ్మాయి అందంగా ఉంటే సరిపోదు . మంచితనం , అమ్మతనం కూడా  ఉండాలి . అబ్బా… ఏదో ఒక ఫిటింగ్ పెడతావు . సరేలే ఆఫీస్ కి లేట్ అవుతుంది నేను సాయంత్రం ఫోన్ చేస్తాను. సరే…. జాగ్రత్త నాన్న … అలాగే… ఫోన్ కట్ చేసి బైక్ స్టార్ట్ చేసాడు. ఏరా….. నువ్వు చెప్పేది నిజమేనా…  ఎవరా అమ్మాయి. ఎవడికి తెలుసు…. గుడిలో చూశాను. అమ్మాయి బాగుందా… బాగుందానా…….. ఎవడు కని పుణ్యం కట్టుకున్నాడో గానీ వాడికి గుడి కట్టి బంగారు కిరీటం పెట్టించాలి . అంత బాగుందా…. నన్ను పిలవాల్సింది కదరా…… మళ్ళీ కనిపిస్తే చూపిస్తాలే… ఆఫీస్ రావడంతో బైక్ పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరికి వస్తారు . లోపలికి వెళ్ళి బటన్ ప్రెస్ చేసేంతలో గుడిలో కనిపించిన వైట్ డ్రెస్ అమ్మాయి కనిపించడంతో ఆగిపోతాడు . శక్తి ….. బటన్ ప్రెస్ చేయ్యరా…. రేయ్….. నేను చెప్పాను కదా గుడిలో కనిపించిన అమ్మాయని తనే…… ఎవర్రా…. ఆ వైట్ చుడీదార్… శక్తి చూపించిన వైపు చూసి షాక్ అవుతాడు . వీడు చెప్పింది ఐశ్వర్య మేడమ్ గురించా…… చచ్చాను…. శక్తి…. శక్తికి విషయం చెప్పేంతలో ఐశ్వర్య లిఫ్ట్ లోకి రావడంతో సైలెంట్ గా ఉండి పోయాడు . శక్తి వైపు చూస్తూ బటన్ ప్రెస్ చేస్తుంది . బాలాజీ భుజం మీద చెయ్యి ఆన్చి ఐశ్వర్యని చూస్తూ ఉన్నాడు . కర్మ……. వీడు కంపెనీ ఎండీకే సైట్ కొడుతున్నాడు .  వీడికి విషయం ఎలా చెప్పాలి . కత్తిలా ఉంది కదరా….. బాలాజీతో నెమ్మదిగా చెబుతాడు . శక్తి మాటలు వినిపించడంతో ఐశ్వర్య కోపంగా చూస్తుంది . బాలాజీ కంగారుగా శక్తికి విషయం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఐశ్వర్య తనని గమనించి చెప్పొద్దని కళ్ళతోనే సైగ చేస్తుంది . వినిపించిందా…… సారీ..  అయినా  అంత కోపం ఎందుకండి …. జష్ట్ కాంప్లిమెంట్ అనుకొండి ….  కొత్తగా జాయిన్ అయ్యారా… అవును … నేను నిజంగా చాలా లక్కీ ….. ఇంత త్వరగా కనిపిస్తారు అనుకోలేదు. లిఫ్ట్ డోర్ ఓపెన్ అవడంతో సైలెంట్ గా బయటికి వచ్చేస్తుంది . శక్తి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వస్తాడు . హెల్లో…. ఇంతకీ మీ క్యాబిన్ ఎక్కడ…. శక్తి వైపు చూస్తూ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది.  బాలాజీ కంగారుగా శక్తి దగ్గరికి వస్తాడు . రేయ్….. ఇలారా… చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకు వెళ్తాడు . ఏంట్రా… ఆ కత్తి….. ఛీ…… ఛీ…..ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు . ఎవరు… మన బాస్ రా…. వాట్…… అంటే…… తను….. ఐశ్వర్య మేడమ్ ….. దేవుడా……..  నా పని అయిపోయింది . ముందే చెప్పి చావొచ్చు కదరా.. ఆవిడ చూస్తుంటే ఎలా చెప్పమంటావు . ఇప్పుడేం చేయాలి.. వెళ్లి సారీ చెప్పు ….. భయంగా ఉందిరా… ఛా….. ఆవిడని కామెంట్ చేసినప్పుడు లేదా …. ఆవిడ సీరియస్ అవ్వక ముందే వెళ్లి కన్వీన్స్ చెయ్యి . సరే…… నెమ్మదిగా ఐశ్వర్య క్యాబిన్ దగ్గరికి వస్తాడు . తను ఫోన్ మాట్లాడుతూ ఉంది.  ఫోన్ కట్ చేసి శక్తి వైపు చూస్తుంది . సారీ……….. మేడమ్ …….. పేరెంటి …. శక్తి….. శక్తి స్వరూప్….. అమ్మాయిలు అందరితో ఇలానే బిహేవ్ చేస్తావా…. అయ్యో మేడమ్…. మరీ అంత వెధవని కాదులెండి . ఏదో అలా జరిగిపోయింది. క్షమించండి…. అయినా మీరు ఎండీ అని తెలిసుంటే అసలు మీ వైపు కన్నెత్తి కూడా చూసేవాడిని కాదు. ఐశ్వర్య మౌనంగా శక్తి వైపే చూస్తూ ఉంది. అలా చూడకండి మేడమ్ … నా పెళ్ళికోసం మా నాయనమ్మ పెట్టే టార్చర్ భరించలేక నేనే ఎవరో ఒకర్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా…. అందుకే ఈ తిప్పలన్నీ…. కాకపోతే మీ విషయంలో కొంచెం ఓవర్ గా మాట్లాడాను అంతే…. తప్పుగా అనుకోకండి. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించేయండి . హుమ్…. ఒకే….. రేపటి నుండి మీరు నాతో పాటు ఫీల్డ్ వర్క్ కి రండి . అంటే నన్ను క్షమించినట్టేనా మేడమ్ …. సీ ….. మిస్టర్ శక్తి …. ఈ ఆఫీస్ లో చాలా మంది అమ్మాయిలు వర్క్ చేస్తున్నారు . వాళ్ళ సెప్టీ కూడా మా భాద్యతే కదా…  అందుకే…. నీ మీద నాకు పూర్తి నమ్మకం కలిగే వరకు నువ్వు ఫీల్డ్ వర్క్ లోనే ఉంటావు . మేడమ్….. ఇది చాలా అన్యాయం . అన్ని కత్తులు ఒకేలా ఉండవు మిస్టర్ శక్తి…… కొన్ని గుచ్చుకుంటాయి కూడా…. అందుకే ఇక నుంచి కత్తుల జోలికి వెళ్లడం మానేయ్ ….. మేడమ్…… జష్ట్ ఫాలో మి …….  అండర్ స్టాండ్….. ఒకే మేడమ్ … యూ కెన్ గో… అక్కడి నుండి తన క్యాబిన్ దగ్గరికి వచ్చి సీట్ లో కూలబడతాడు . ఏమయిందిరా… రేపటి నుంచి ఫీల్డ్ వర్క్ చూసుకోమన్నారు . అవునా… పోనీలే.. ఏంటి పోనీలే …… ఫీల్డ్ వర్క్ అయితే ఆ ప్రోజెక్ట్ మ్యానేజర్స్ టార్చర్ భరించలేము . మనల్ని వర్క్ లో ఇన్వాల్వ్ చెయ్యకుండా చెత్త పనులన్నీ అప్పగిస్తారు.  అలా చేస్తూ ఉంటే మనం ఇంజనీర్స్ అన్న విషయమే మరచిపోతాం . అది నాకు అసలు నచ్చదు.  రిజైన్ ఇచ్చేస్తాను. ఎందుకు అలా నెగిటివ్ గా ఆలోచిస్తావు . ఒకరోజు వెళ్ళి చూడు….. నీకు నచ్చక పోతే అప్పుడు ఏం చేయాలో  ఆలోచిద్దాం . హుమ్… సరే.. నా డార్లింగ్ ఇవాళ్ళ నీ అదృష్టం నీకు ఎదురు పడుతుందిరా అని చెప్పింది.  కానీ ఇలా రివర్స్ అయ్యిందేంటి… బాలాజీ నవ్వుతాడు . ఇంతలో శక్తి ఫోన్ రింగ్ అవుతుంది . ఫోన్ మాట్లాడి నవ్వుతూ బాలాజీ వైపు చూస్తాడు. ఏమయింది . నీకు చెప్పాను కదా… ఊర్లో మా స్తలాన్ని ఒకడు ఆక్రమించాడు అని … హా…. ఆ కేస్ కోర్ట్ లో ఉంది కదా… ఇప్పుడు ఆ కేస్ గెలిచాంరా…. ఆ స్తలం మాకే చెందుతుంది అని కోర్ట్ తీర్పు ఇచ్చింది.  వావ్…. సూపర్ రా…  చాలా సంతోషంగా ఉంది.  అమ్మ సమాధి ఉన్న స్తలం అది . నాకు దక్కకుండా పోతుంది అనుకున్నాను . కానీ అమ్మ ప్రేమ కదా అందుకే ఆ దేవుడు నాకే దక్కేలా చేశాడు. హుమ్… ఇప్పుడు ఏమంటావు . మీ నాయనమ్మ చెప్పింది నిజం అయ్యింది కదా…  అవును… నా డార్లింగ్ ఎప్పుడూ నిజమే చెబుతుంది. అంటే…. ఐశ్వర్య మేడమ్ నీ లక్ అన్న మాట. ఏం కాదు…  ఇందులో ఆవిడ చేసింది ఏముంది . అది నా లక్ …..  అబ్బో… ముందు పని చూడు… @@@@@@@@ ఉదయాన్నే ఫోన్ రింగ్ అవడంతో కళ్ళు తెరవకుండానే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.  హెల్లో… రేయ్ నాన్న నేను రా.. చెప్పు డార్లింగ్ ..  మీ అమ్మ సమాధి ఉన్న స్తలం నీ పేరు మీద రిజిస్టర్ చేయిస్తున్నాడు మీనాన్న … వీలు చూసుకుని ఇంటికి రా.. మొన్ననే కదా వన్ మంత్ లీవ్ పెట్టాను మళ్ళీ అంటే ఎలా కుదురుతుంది . అబ్బా వాదించకురా… వీలు చూసుకుని రమ్మని మీ నాన్న చెప్పాడు తర్వాత నీ ఇష్టం. సరే…. వచ్చి చస్తాలే…  సరే నాన్న నీ ఆఫీస్ కి లేట్ అవుతుంది. రెడీ అవ్వు . నేను తర్వాత ఫోన్ చేస్తాను . అలాగే.. ఫోన్ కట్ చేసి గడియారం వంక చూస్తాడు.  అమ్మో …. టైం లేదు త్వరగా వెళ్ళాలి. కంగారుగా పైకి లేచి వాష్ రూమ్ లోకి వెళ్తాడు.  ……………… లేట్ అయ్యింది . మేడమ్ ఏం అంటారో … ఎక్ష్యూజ్ మి … కమ్….. గుడ్ మార్నింగ్ మేడమ్ .. ఐశ్వర్య అతని వైపు చూసి గడియారం వైపు చూస్తుంది. సారీ…. మేడమ్ లేట్ అయ్యింది . ఈరోజు ఏ గుడికి వెళ్ళావు. గుడికా…. అదే…. అమ్మాయిల కోసం వెళతావు కదా…  ఛ…  ఛ… నేనేం అమ్మాయిల కోసం వెళ్ళను మేడమ్ .. మా నాయనమ్మ మొక్కు అందుకే ఎవెరీ సాటర్ డేయ్ వెళ్తాను అంతే… మరెందుకు లేట్ అయ్యింది . అలారం మోగలేదు మేడమ్ … సాకులు బానే దొరుకుతాయి……  నిజం మేడమ్ .. ఇప్పుడు నువ్వు చెప్పేది నిజమా కాదా అని తెలుసుకునేంత టైం లేదు కానీ… సైట్ కి వెళ్ళాలి.. నాతో రా… ఐశ్వర్య పైకి లేచి బయటికి రావడంతో శక్తి కూడా వెనకాలే బయటికి వస్తాడు . వీళ్ళు బయటికి వచ్చేసరికి కార్ రెడీగా ఉంది. ఐశ్వర్య బేక్ సీట్ లో కూర్చుంది. శక్తి డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు . అనవసరంగా ఎక్కువ వాగాను. ఈవిడ రంజిత్ గారికి కానీ చెప్పిందంటే……… ఆయనకి నా మొహం ఎలా చూపించాలి .  దేవుడా ఇలా ఇరికించేసావేంటయ్యా… మనసులోనే అనుకుంటూ ఎదురుగా ఉన్న అద్దంలో ఐశ్వర్యని చూస్తాడు. ఫోన్ మాట్లాడుతూ ఉంది. నాయనమ్మ చెప్పింది నిజమే……. అందం ఒకటే సరిపోదు. చూడడానికి దేవతలా ఉంది కానీ లక్షణాలు మాత్రం అలా లేవు . ఐశ్వర్య  ఫోన్ కట్ చేసి శక్తిని గమనిస్తుంది . ఏంటి శక్తి నన్ను తిట్టుకుంటున్నావా…. ఛ… ఛ…… అదేం లేదు మేడమ్

కథను కొనుగోలు చేయండి