telugu stories మనసు మాట వినదు 6 సూర్యుడి రాకతో కొద్దిగా తెల్లారుతూ ఉంది. ఆరు బయట మంచం మీద నిద్రపోతూ ఉన్నాడు శక్తి. మొహం మీద చినుకులు పడినట్టు అనిపించడంతో కళ్ళు తెరిచి చూస్తాడు . ఎదురుగా ఎవరో అస్పష్టంగా కనిపించడంతో కళ్ళు నులుముకుని మళ్ళీ చూస్తాడు . ఎదురుగా ఐశ్వర్య టవల్ తో తల తుడుచుకుంటూ కనిపించింది . ఆకుపచ్చ రంగు ఒణీలో మెరిసిపోతుంది. పక్కకి తిరిగి తల కింద చెయ్యి పెట్టుకుని తనని చూస్తూ ఉన్నాడు . ఐశ్వర్య పక్కకి చూసేసరికి ఎదురుగా పూల తోట కనిపిస్తుంది. నవ్వుతూ తోట దగ్గరికి వెళ్తుంది.రకరకాల పువ్వులు అందంగా విచ్చుకుని ఉన్నాయి . వాటిని చూస్తూ ఉంటే చిన్నప్పుడు తన తల్లితో కలిసి గడిపిన క్షణాలు గుర్తొస్తాయి తనకి. తన మనసంతా సంతోషంతో నిండి పోయింది. వీచే గాలికి ఆ పూల పరిమళం నాసికని తాకుతూ మనసుని పులకరింప చేస్తుంది. నవ్వుతూ రెండు చేతులు చాచి గిరగిరా తిరుగుతూ ఉంది. శక్తి ఆశ్చర్యంగా తననే చూస్తున్నాడు. ఎలాంటి అలంకారం లేకపోయినా పూల చెట్ల మధ్య చిలకలా పచ్చగా మెరిసిపోతుంది. మంచం మీద నుండి లేచి తన దగ్గరికి వస్తాడు . శక్తి వచ్చిన విషయం కూడా గమనించలేదు తను. తిరుగుతూ తిరుగుతూ శక్తి మీద పడుతుంది . తనని పడిపోకుండా పట్టుకుని కళ్ళలోకి చూస్తాడు. తన చూపుల నుండి తప్పించుకుంటూ పక్కకి జరిగి నిలబడుతుంది . మొదటిసారి ఐశ్వర్య నీ కళ్ళలో నిజమైన సంతోషాన్ని చూడడం. ఈ తోట నీకు బాగా నచ్చిందా. అవును…. అమ్మ ఉన్నప్పుడు ఇంటి చుట్టూ ఇలానే మొక్కలు పెంచేది. రోజూ తనతో కలిసి మొక్కలకి నీళ్ళు
కథను కొనుగోలు చేయండి