రాజ్యం పట్టుకోల్పోయింది ,ప్రజలు దారి తెన్నూ లేకుండా ఉన్నారు. శాతకర్ణి కి ఇది పెనుసవాలు గా మారింది.రాజ్యం లో అందరికి క్రమశిక్షణ అలవాటయ్యేలా చర్యలు తీసుకున్నాడు.రాజ్యం లో కామం ఉధృతి తగ్గేలా హంస మేడలను నియంత్రణ లోకి తెచ్చాడు .వర్ణాంతర వివాహాలను నిషేధించాడు.శృంగార సాహిత్యాన్ని ఆదరించకుండా శాస్త్ర విజ్ఞాన ,ఖగోళ ,వైద్య శాస్త్రాలు వృద్ధి చందెలా చేసాడుమూఢ నమ్మకాలను నిర్ములన కు కృషి చేసాడు .చరిత్ర లో మొదటి సారి నాణేలు ముద్రించి వర్తకం లో పెను మార్పు తీసుకు వచ్చాడు .ఇంతలో ఒక నాగసాధువు శాతకర్ణి కి రెండు పుస్తకాలు ఇచ్చాడు .ఈ పుస్తకాలను రహస్యం గా వుంచాలి అని చెప్పాడు.ఒక దాని మీద యోగ వశిష్టo అని రాసి ఉంది .రెండవది రామరాజ్యం అని వుంది .రాజ్యం దీన పరిస్థితి దృష్ట్యా రామరాజ్యం చదవసాగాడు సింహబలుడు .అందులో రామరాజ్యం ఎలా ఉండేదో పూసగుచ్చినట్టు తెలుపబడిందిరాజ్యం దీన పరిస్థితి దృష్ట్యా రామరాజ్యం చదవసాగాడు సింహబలుడు .అందులో రామరాజ్యం ఎలా ఉండేదో పూసగుచ్చినట్టు తెలుపబడింది.రామ రాజ్యం అంటే ప్రజలు రామునికి సేవకులు కాదు. ప్రజలను సేవించటం పరమావధి గా భావించాడు ఉత్తమపురుషుడైన రాముడు.పట్టాభిషేఖం రోజు ప్రజలకు తన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మర్యాదపురుషోత్తముడు. తరువాత సీత ను రక్షించి తీసుకురావటానికి సహాయం చేసిన అందరికి కృతఙ్ఞతలు చెప్పారు.కృతజ్ఞతాభావం ప్రజల్లో మమేకమయ్యేలా చేసారు శ్రీ రాముడు. ప్రజలు తాముచేసిన పనులకు సరైన ప్రతిఫలం పొందేవారు.రాజ్యానికి సమీపం లో బ్రహ్మదేవుని గుడి ఉంది ,గుడి వద్దకు వెళ్ళడానికి కొలను దాటాలి.దానికోసం తెప్పలు, పడవలు ఉండేవి. రాజుగారికి కష్టం గా ఉందని గుడి వరకు కఱ్ఱవంతెన కట్టారు. ప్రజలు కూడా సుఖబడ్డారు. ఒక రోజు శ్రీరాముడు వంతెన గుర్రం మీద దాటుతూ కాళిగా పడివున్న తెప్పలను చూసారు. వెంటనే తెప్పనడిపే వారిని పిలిపించి వారి జీవనభృతి కోల్పోయారని తెలిసి వారికీ సత్వరం గుడి నిర్వహణ, వంతెన నిర్వహణ బాధ్యతలు ,వారి కష్టానికి ప్రతిఫలం అందేలా చూడమని ఆదేశించారు.అయోధ్య ద్వారం వద్ద సత్యం,ధర్మం వల్ల మీలో భయం ప్రాలద్రోలుతాయి అని వ్రాయించారు.సనాతన ధర్మం ఆయువుపట్టుగా సాగింది రామరాజ్యపాలన అని వుంది . కేరళ దేశం లో భయంకరమైన అడవిలో నిధి దొరుకుతుందని నాగ సాధువులు శాతకర్ణి కి చెప్పారు.రాజ్యం నుండి భీకర అరణ్యానికి బయలు దేరాడు నిధి వేటకు రాజు.శాతకర్ణి తన పరివారం లో మహా వీరులు పది మందిని తీసుకు వెళ్లాడు.మార్గo మధ్య లో నది అడ్డం వచ్చింది. వెడల్పుగా ఉన్న నదిని ఎలా దాటాలి అని అనుకొంటూ ఉండగా ఒక పెద్ద నావ వచ్చింది.నావ లోనుండి తనకు పరిచయ మైన ముఖం కనపడింది.అతడే భట్టు.అతడు శాతకర్ణి ని గుర్తుపట్టి లోపలికి ఆహ్వానించాడు.అప్పుడు నావ ప్రయాణo మొదలయ్యింది.జీవనయానం లో ఏంతో మంది మహానుభావులను చూసిన శాతకర్ణికి భట్టును చూడగానే ఒక యుగపురుషుడిని చూసిన అనుభూతి పొందాడు. శాతకర్ణి భట్టును ఖగోళ పరిశోధనలను గురించి అడిగాడు. అప్పుడు భట్టు ఇలా అన్నాడు,మిత్రమా ఈ భూమి రూపం ఏమిటో తెలుసా అన్నాడు..”.బల్లపరుపుగా ఉండును అని చెప్పి ,మిత్రమా నాదో సందేహం ? మరి గుండ్రంగా ఉన్న భూమిని వరాహావతారం లో ఉన్న శ్రీమహావిష్ణువు కాపాడారు కదా అని అన్నాడు శాతకర్ణి.అప్పుడు భట్టు నవ్వుతూ నేనూ భూమి బల్లపరుపు గా ఉండేది అనుకున్నాను, కానీ నౌకాయానం లో నక్షత్రాల స్థితి గతులను చూసిన తరువాత భూమి గుండ్రం గా ఉండడమే కాకుండా తనచుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తాను తిరుగుతుంది అని క్లుప్తంగా ముగించి ఆర్యభట్టీయం అనే పుస్తకం చూపించాడు.