గౌతమి పుత్ర శాతకర్ణి – Part 1

గౌతమీ నది తీరంలో ఉన్న ఒక పెద్ద సామ్రాజ్యం శాలివాహన సామ్రాజ్యం . శ్రీముఖ శాతివాహనుడు తన పదమూడవ ఏట ఉజ్జయినిరాజు విక్రమార్కుడిని ఓడించాడు.భట్టి మహారాజు తో సహ ఉజ్జయిని మహారాజుని కొన్ని వందల సంవత్సరాల చరిత్రని రూపుమాపి కొంగ్రొత్త శాతవాహన శకాన్నిప్రారంభించారు.శ్రీముఖ శాలివాహనుడు అది విక్రమశకానికి చరమగీతం పలికింది.కానీ అంత పెద్ద సామ్రాట్టుని ఒక చిన్న దేశ యువకుడు ఎలా ఓడించాడన్నది ఎవ్వరికీ తెలియని రహస్యం .ప్రస్తుతం గోదావరి నది పుట్టినిల్లయిన నాసిక త్రయంబకేశ్వరాన్ని అనుకొని శాతివాహన సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నది.శివస్వతి తన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీ ముఖుడు సముపార్జించిన విశేష సామ్రాజ్యం ఇప్పుడు దండయాత్రలతో హొరెత్తుతున్నది. నర్మదా నదికి ఉత్తరంగా ఉన్న విక్రమార్కుని వారసులు, అయిన నహపునితో కలగలసి తమ పూర్వ వైభవాన్ని పొందాలనుకుంటున్నారు.యవనులు, మ్లేత్యులు, పల్లవులు మొదలైన వారు రాజ్యాన్ని దక్కించుకోవడానికి విఫల యత్నాలు చేస్తున్నారు.శివస్వతికి వారసుడు లేడు, వారసులు లేని రాజ్యం మీదే శత్రువులు చూపు రాజ్యాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పన్నాగాలు పన్నుతున్నారు.ఒకరోజు శివస్వతి గోదావరి తీరాన ఉన్న దట్టమైన అడవిలో వేటకు బయలుదేరాడు.పులిని చూసి దాని మీదకు బాణం ఎక్కుపెట్టాడు.ఇంతలో ఊహించని పరిణామం ఎదురైంది, గుర్రం మీద ఉన్న రాజుగారిని వెనుక నుంచి సింహం దాడి చేసింది.ఇంతలో ఊహించని పరిణామం ఎదురైంది, గుర్రం మీద ఉన్న రాజుగారిని వెనుక నుంచి సింహం దాడి చేసింది.రాజుగారు నేలమీద పడిపోయారు. కళ్ళు బయర్లు కమ్మాయి.వెంటనే ఒక వింత జరిగింది.చెట్టు పైనుండి ఒక కుర్రాడు సింహం మీద దూకాడు. సింహాన్ని నిలువరించి దాన్ని మచ్చిక చేసుకుని, సింహం మీద ఎక్కాడు.రాజుగారు తేరుకుని “బాలకా! నీవెవరవు.” అడిగారు.“నేను ఈ అడవి పుత్రుడుని, నన్ను ఇక్కడ ఉన్న తెగ కు చెందిన వాడిని . మేము జంతువులతో కలిసిమెలిసి ఉంటాము.” అప్పుడు రాజుగారు ఆ తెగ వారిని కలుసుకుని బాలుడు గురించి అడిగారు. అప్పుడు వాళ్ళు ఈ బాలుడు తమకు అడవిలో దొరికాడని చెప్పారు.బాలుని చూసి రాజుగారు బాలకా! “నేను నిన్ను యువరాజుని చేస్తాను. నీవు నాతో మన రాజ్యానికి రావలసి ఉంటుంది” అని చెప్పారు.ఆ తెగవాళ్ళు బాలుడిని ఒప్పించి, రాజుతో పాటు పంపించారు.ఆ తరువాత ఆ కుర్రాడు రాజు గారితో సింహం ఎక్కి రాజ్యానికి బయలు దేరాడు. అలా ఆ కుర్రాడు సింహ౦ మీద రాజ్యలోనికి రావడంతో ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యి భయపడ్డారు.మహారాణి పేరు గౌతమి . అందంగా ఉన్న బాలుని చూసి ముచ్చటేసింది రాణిగారికి బాలుని గురించి ఆరా తీసి,ఇతన్ని మనంపెంచుకుందాం అంది రాణి.అప్పుడు శివస్వతి బాలుని రాణికి చూపించి యువరాజుకి ఏమి పేరు పెట్టాలని ఆలోచించారు గౌతమీపుత్ర అని పెడదాము, బాలుని జన్మ వృత్తాంతం ఎవరికీ (తర్వాత తరాలకు) తెలియకుండా ఉండాలి. ఎలాగో గోదావరి నదీతీరాన దొరికాడు కాబట్టి గౌతమీపుత్ర అని పెడదాము అన్నారు.సింహాన్ని అధిరోహించాడు కాబట్టి శాతకర్ణి అని పేరు పెడదాము అని అన్నారు మహారాణి సింహాన్ని అధిరోహించాడు కాబట్టి శాతకర్ణి అని పేరు పెడదాము అని అన్నారు మహారాణి.దత్తత కార్యక్రమము, నామకరణం అయిన తర్వాత అతడిని గౌతమ మహాముని ఆశ్రమానికి(గురుకులం) పంపించారు. గురుకులంలో అన్నీ శాస్త్రాలను ఔపోసన పట్టిన శాతకర్ణి, ఏకసంతాగ్రహి అన్నీ విద్యలను చక్కగా నేర్చుకున్నాడు.జ్యోతిష్యులు యువరాజు జాతకం చూసి జంబూద్వీపాన్ని పాలించే చక్రవర్తి అవుతాడని చెప్పారు.ఈ మాట దావానంలా వ్యాపించింది. అప్పుడు మహానందనం అనే ప్రాంతం నుండి సాధువులు రాజ్యానికి వచ్చారు. వాడు శివస్వతికి నమస్కరించిఅప్పుడు రాజుతో ఇలా అన్నారు రాజా “మీ ముత్తాత గారు శ్రీముఖ శాలివాహనుడు మాకు అత్యంత ఆప్తులు . మీకు ఒక రహస్యం చెప్పాలి ”మేము పరశురాముని ప్రియ భక్తులం. మేము పరశురాముడు సృష్టించిన కొడంగల్లురు భగవతీ ఆలయంలోని గురుకులంలోని వాళ్ళము.మీ ముత్తాత గారు మా దగ్గర ఒక రహస్య మర్మకళ నేర్చుకున్నారు.ఆయన ఒక్క వేటుతో 15 మందిని చంపిన ఘనుడు.మీకు ఒక తాళపత్ర గ్రంధం ఇస్తాము.అది మీ కుమారునికి ఇచ్చి అందులో ఉన్న సూచనలు అనుసరించి మహానందనంలో ఉన్న గురుకులంలోనికి వెళ్ళమని చెప్పండి. అక్కడి నుండి అతనిని మహా చక్రవర్తిగా తయారు చేసేందుకు ఇంకొక మహాచక్రవర్తి దగ్గరకు ఆ గ్రంధమే తీసుకెళుతుంది. తాను ఒంటరిగా ఈ కార్యక్రమము నిర్వర్తించవలిసి ఉంటుంది అని అన్నారు.ఇదంతా విన్న మహారాజు పులకించి పోయారు ఈ మహాకార్యాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని శాతకర్ణికి ఆ పవిత్ర గ్రంధాన్ని ఇచ్చారు.శాతకర్ణి ఆ గ్రంధం తెరచి చూశారు. “అందులో పరశురాముని గురించి ఉంది. ఆయన ఆశ్రమం జంబూద్వీపానికి దక్షిణ కొనలో ఉన్నది.దట్టమయిన కీకారణ్యంలో ఉన్నది.దానికి దారి తెలియాలి అంటే ఇది తెలియాలి అని ఉంది“సృష్టిమూలం అగ్గిరవ్వయితే పవిత్ర జలాన్ని కూడా ప్రమిదగా వెలిగిస్తుంది.ఆ దీపాన్ని మూడు కాంతుల నడుమ ఉంచితే మీ మార్గం ఉన్నత స్థానంలో ఉన్నవాడు చూపిస్తాడు.”సృష్టిమూలం అంటే ఏమిటని ఆలోచించి శాతకర్ణి అనేక పుస్తకాలు చదివాడు.ఒక రోజు ఏదిఏమైనా తనపై ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని శాతకర్ణి అన్వేషణ మొదలు పెట్టారు.అనేక సాధువులను కలిసి చర్చించారు. ఎంతకీ అవగతం అవ్వడం లేదు.”అప్పుడు ఒక అందమైన లోయ వద్దకు వచ్చాడు శాతకర్ణి. అక్కడ ఒక అందమైన కన్యను చూసి వింతగా అనిపించింది. ఇంత అందమైన సౌందర్య రాశిని ఎప్పుడూ చూడలేదు అతను వెంటనే ఆమెను వెంబడించాడు. ఆమెను రహస్యముగా ఆమె పరివారం వద్దకు వెళ్ళి చూశాడు.ఆ కన్య పరివారం ఒక అందమైన తటాకం (చెరువు) వద్ద ఉంది.బహు నున్నగా చెక్కిన రాళ్లతో తటాకమునకు చుట్టూ గోడ కట్టబడి ఉన్నది. చెరువు లోకి మెట్లు మరియు తూరలు కట్టిన పనితనం చూసి శాతకర్ణి విస్తుపోయాడు .శతధృవంశ యోధుల్లా ఉన్న పెద్ద వృక్షాలు ,దట్టమైన నీడ తో పటు పిల్ల గాలులు కూడా వీస్తుండండం తో మైమరచి ,పిల్ల కోసం వెతకసాగాడు .కానీ నీటి లో పిల్ల తిమ్మెరలు చూసి ఏమి ఈ సౌందర్యం అనుకున్నాడు. ఇంతలో ఒక పెద్ద ఉడత ఒక చెట్టు మీదనుంచి ఇంకొక చెట్టు మీదకు ఉరుకులు పరుగులు చూసాడు. చెట్టు మీద రెండు కోతులు కూర్చొని ఉన్నాయి ,వాటి తోకలతో పిల్లకోతి ఉయ్యాలలూగుతోంది.నేల మీద పచ్చిక మృదువుగా కాళ్లకు తగులుతోంది. తుమ్మెదలు, తేనెటీగల ఝుంకారాల మధ్య పెద్ద పళ్లెం లాగా ఉన్న ఆకులతో ఉన్న ఎర్ర కలువలు మరింత వికసిస్తున్నాయి. పక్షుల కిలకిలారావాలు విని చెరువు లో ఉన్న ఒక దిబ్బ మీద ఒక దృశ్య కావ్యం చూసాడు శాతకర్ణి. చెరువులో దిబ్బ మీద ఎర్ర చిలువ బాతులు ,నారాయణ పక్షులు, నీటి కోడిల గుంపు చూసి విహంగ జంటల ప్రేమకేళి చూసి మళ్ళి సుందరాంగి గుర్తుకు వచ్చింది. అలా వెళ్లగా ఒక శివాలయం కనపడింది .అక్కడ ఆ దివ్యంగన చెలికత్తెలతో కూడి దేవునికి హారతి అర్పించి ,చెరువు లోకి దిగింది. చెలికత్తెలు ఇక్కడ మొసళ్ళు ఉండవు కదా అని పరిహాసమాడారు. ఇంతలో స్నానం ముగించి దివ్యంగన మహాదేవునికి పూజాదికాలు చేసింది. కానీ శాతకర్ణికి ఆమె మోము (ముఖం) అగుపించుట లేదు. వేరే వైపుకు వెళ్లి చూద్దామని బయలుదేరాడు, పూజ ముగించుకొని ఆమె కూడా శాతకర్ణి వైపు వచ్చింది.ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. దెబ్బతో ఇంతకూ ముందు చూసిన ప్రకృతి సౌందర్యం అంతా మనస్సులోంచి మటుమాయం అయిపోయింది .ఆమెను చూస్తూ స్థాణువు ల ఉండి పోయాడు . ఇంతలో భటులు వచ్చి శాతకర్ణి ని చుట్టుముట్టారు.ఆమె శాతకర్ణి అందము చూసి ముగ్ధురాలై సరస్సు లోనుండి ఒక కాలువను తెంపి పంటితో కొరికి తన స్తనద్వయం మీద కలువను పెట్టి శాతకర్ణి మీదకు విసిరి చెలికత్తెలతో పారిపోయింది. వారు చాల దూరం వెళ్లిన తరువాత శాతకర్ణి ని భటులు యువరాణిని చూసినందుకు ఒక చెట్టుకు కట్టేసి అడవి లో ఒంటరిగ వదిలేసారు.ఆ దివ్యంగన మత్తు లో ఉన్న శాతకర్ణి ఆమె రూపాన్ని స్ఫురణకు తెచ్చుకున్నాడు. ఇంతలో ఇందాక ఉయ్యాల ఊగుతున్న కోతిపిల్ల శాతకర్ణి కట్లు విప్పేసి కేరింతలు కొడుతూ వెళ్ళిపోయింది. అప్పుడు శాతకర్ణి అనుకున్నాడు “ఆమె గంధర్వురాలై ఉంటుందా,లేక మత్స్యకన్యా ? లేక నాగకన్యా ?. ఏమి సౌందర్యo ! ….పూర్ణచంద్రుడు లాగా పరిపూర్ణంగా ,జాలువారుతున్న కురులు తేనెటీగల సమూహంలా,నెలవంకను పోలిన వికసించిన పెదవుల సమాహారం, సివంగిని గుర్తుకు తెచ్చే ఆ నడుము, ఆ వయ్యారాల హంస నడక, శ్వేతాంబరాల వంటి మేనిఛాయ ,కస్తూరి సువాసనలతో ,మల్లెపువ్వు లాగా ,కోకిల కంఠం తో ,మన్మధుడే దిమ్మతిరిగేలా వెల్లువిరిసిన వసంతం లాగా ఉంది ఆ దివ్యంగన.