నిజం గా నేను అంటే అంత ఇష్టమా 5

షర్మిల వైపు గన్ ఎక్కు పెట్టిన రాజు వింత గా నవ్వుతూ రెండు సార్లు కాల్చాడు అందులో ఒక బుల్లెట్ ఆమె కడుపు లోకి దూసుకొని వెళ్లింది, ఇంకోటి చాత్తి లోకి దిగింది తరువాత పక్కన ఉన్న కుర్చీ నీ లాకుని ఎదురుగా సెల్ లో ఉన్న ACP శ్రీధర్ వైపు తిరిగాడు రాజు, ఒక సారిగా రాజు నీ అలా చూడగానే శ్రీధర్ వెన్ను లో వణుకు మొదలైంది “రాజు please నను వదిలేయి నీకు ఎంత డబ్బు కావాలి అన్న ఇస్తాను నను ఏమీ చేయకు” అని సెల్ లోపలి నుంచి చేతులు బయటికి పెట్టి రాజు కాలు పట్టుకున్నాడు శ్రీధర్, రాజు మెల్లగా లేచి శ్రీధర్ తల పైన చేత్తో నీమురుతు “అయ్యో సార్ మీరు పెద్ద వారు నా కాలు మోకితే నా ఆయుషు తగ్గుతుంది మీ ఆయుషు పెరుగుతోంది కాబట్టి ఆయుషమ్మాన్ భవ “అని తల లోకి వరుసగా మూడు బుల్లెట్స్ దింపేసాడు అప్పుడు శ్రీధర్ తల నుంచి రక్తం ధారాళంగా కారుతుంది అది చూసి పూజా భయం తో కేకలు వేస్తూ విక్కి వెనుక దాకుంది.ఆ అరుపు కీ వెనకు తిరిగిన రాజు గన్ నీ వెనకు దాచి పెట్టి” అయ్యే సారీ వదిన అరె తప్పుడు వరుసా నేను రమేష్, ప్రమోద్ కంటే పెద్ద వాడిని అయినప్పుడునువ్వు నాకూ హా మరదలు అవుతావు, సారీ అసలే కడుపు తో ఉన్న నువ్వు ఇలాంటి ఘోరాలు చూడాల్సి వచ్చింది” అని అన్నాడు రాజు ఆ మాటలకి ఇంకా కోన ఊపిరి తో ఉన్న షర్మిల గట్టిగా శ్వాస పిల్చుకొని” బాబు విక్కి ఈ రాక్షసుడి నుంచి నా పూజా నీ మా వంశం నిలబెట్టే ఆ వారసున్ని నువ్వే కాపాడాలి “అని విక్కి వైపు నిస్సహాయం గా చూస్తూ చేతులు ఎత్తి నమస్కారము పెట్టి ప్రాణాలు వదిలింది.“అరెరె మా పిన్ని కీ నీ మీద ఎంత నమ్మకం వచ్చింది బ్రో నీ దొంగ మొహం దానా చావు” అని మళ్ళీ 2 బుల్లెట్ లు షర్మిల గుండెల్లో దింపి ఒక క్రూరమైన నవ్వు నవ్వుతూ పూజా వైపు చూశాడు పూజా భయం తో విక్కి వెనుక వణికి పోతుంది “మై డియర్ పూజా ఒక సారి నువ్వు బయటికి వస్తే నీ కడుపులో పెరుగుతున్న ఆ విష శిశువు నీ మాత్రమే చంపుతా లేదు అంటే నిన్ను చంపాలి లేట్ చేయకు మర్యాదగా బయటికి రా” అని గన్ లో బుల్లెట్స్ చూసుకుంటున్నాడు రాజు అదే రైట్ టైమ్ అనిపించింది విక్కి కీ వెంటనే పక్కన ఉన్న కుర్చీ తీసుకొని ఎగిరి రాజు పైకి దుక్కాడు అప్పుడే గన్ లోడ్ చేస్తున్నా రాజు అది గమనించలేదు, కుర్చీ ఒక సారిగా రాజు తల పైన పడే సరికి రాజు కూడా నెలకు ఒదిగాడు అతని చేతిలో ఉన్న గన్ కూడా జారీ వెళ్లి ఎక్కడో పడింది.అలా రాజు, విక్కి పొట్టా పొట్టి గా తలపడారు ఆ తర్వాత విక్కి కొంచెం పై చేయి చూపించాడు ఆ తర్వాత రాజు నీ ఒక గోడకి అణిచి గొంతు పట్టుకుని అడిగాడు “చెప్పు అసలు తార నీ ఎందుకు చంపావ్” అని అడిగాడు విక్కి, దానికి రాజు పిచ్చి ఏక్కినటు నవ్వుతూ “వాహ్ ఏమీ బుర్ర రా నీది నేనే దాని చంపా అని ఎలా తెలిసింది నీకు” అని అడిగాడు “మోన్న రాత్రి పాలేస్ లో ఉన్న సెక్యూరిటీ కెమెరా లు చెక్ చేస్తే నువు తార ప్రమోద్ చనిపోయిన రోజు సాయంత్రం ఇద్దరు కలిసి వెళ్లినట్లు రికార్డు అయింది” అని చెప్పాడు విక్కి,“తార నీ నేను చంపాలి అని అనుకోలేదు ఎందుకంటే నేను అది ప్రేమించుకున్నాం, అది అంటే నాకూ ప్రాణం అందుకే ఆ రోజు వాళ్లు దాని రేప్ చేశారు అని తెలిసాక వాళ్ల చావులు నా చేతిలో అని ఫిక్స్ అయ్యా అందుకే నీ నిచ్చపు ఫ్యామిలీ లోకి పూజా లాంటి మంచి అమ్మాయి వెళ్లకుండా ఉండాలి అనే ఆ రోజు షర్మిల సలీం కాకా తో పూజా నీ చంపేయమ్మంటే నేనే కిడ్నాప్ చేయించి దాని దాచిపెట్టా ఆ తర్వాత పూజా బ్రతికే ఉంది అని తెలిస్తే danger అని తన చేతి ముద్రలు ఉన్న కత్తి నేను ప్రమోద్ డెడ్ బాడి దగ్గరే వదిలేశా తరువాత తార నీ నేను ముంబాయి పంపిదాం అనుకున్న కానీ అది నాకూ నా అన్నయ్య కూడా కావాలి అని ఏడుపు మొద్దులు పెట్టింది అది ఇక్కడే ఉంటే రిస్క్ అని దాని చంపక తప్పలేదు “అని చెప్పాడు,” మరి రమేష్ నీ ఎందుకు చంపావు “అని అడిగాడు విక్కి” ఆ బాంబ్ నా బాబు, ఆ దొంగ మొహం దాని కోసం పెట్టించా కానీ ఆ తాగుబోతు నా కొడుకు మధ్యలో వచ్చి మొత్తం నాశనం చేశాడు “అని చెప్పాడు రాజు. అప్పుడు రాజు తన జేబులో ఉన్న ఒక చిన్న బ్లేడ్ తీసుకొని విక్కి చేతి మీద గీసాడు దాంతో విక్కి వాడిని వదిలేశాడు ఆ తర్వాత రాజు కింద ఉన్న గన్ తీసుకొని పూజా తల మీద పెట్టాడు, అప్పుడు విక్కి ముందుకు అడుగు వేస్తుంటే రాజు గన్ తో విక్కి ఎడమ బుజం పైన కాల్చాడురాజు కాల్చిన బుల్లెట్ వేగంగా వెళ్లి విక్కి ఎడమ బుజం కీ తాకి ఆ బుల్లెట్ తగిలిన వేగం లో వెనకు ఎగిరి పడ్డాడు, అలా ఎగిరి పడిన విక్కి అక్కడ ఉన్న గోడకి తగిలి స్పృహ కోల్పోయాడు, కానీ రాజు అన్న ఒక మాట మాత్రం అతని చెవులో ప్రతి ధ్వనిస్తునే ఉంది “ఈ కథ ఎక్కడ మొదలు అయిందో అక్కడే శాశ్వతంగా ముగిస్తాను” అని రాజు పూజా నీ లాకుని వెళ్లాడు, బుల్లెట్ గాయం తో నెలకు ఓదిగిన విక్కి నిస్సహాయం గా పడి ఉన్నాడు అలా ఒక అర గంట సేపు అలాగే పడి ఉన్నాడు విక్కి, ఆ తర్వాత ఎవరో తన మొహం మీద నీళ్లు చల్లడం తో లేచి కూర్చున్నాడు, అప్పుడు వినీత ఏడుస్తు విక్కి నీ గట్టిగా హత్తుకుంది” మీరు ఇక్కడి కీ ఎలా వచ్చారు” అని కొంచెం నొప్పితో బాధపడుతూ అడిగాడు విక్కి.“నీతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే సడన్ గా గన్ సౌండ్ వినీ భయం తో వీళ్లని తీసుకొని వచ్చా” అని చెప్పాడు ప్రకాష్, తరువాత అందరూ కార్ లో రాజు నీ పట్టుకోవడానికి బయలుదేరారు “వాడు అక్క నీ ఎక్కడికి తీసుకువెళ్లి ఉండొచ్చు “అని కంగారూ గా అడిగాడు నిఖిల్ అప్పుడు రాజు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి విక్కి కీ” ఈ కథ ఎక్కడ మొదలు అయిందో అక్కడే ముగిస్తాను అని రాజు చెప్పాడు అంటే వాడు పూజా నీ ఎక్కడికి తీసుకువెళ్లి ఉంటాడు” అని అడిగాడు విక్కి “పాలెస్ కీ తీసుకువెళ్లి ఉంటాడా “అని అడిగాడు ప్రకాష్ “నో వాడు అక్కడికి తీసుకువెళ్లి ఉండడు కచ్చితంగా అడవి లో ఉన్న గెస్ట్ హౌస్ లో చంపడానికి ప్లాన్ చేసి ఉంటాడు “అని చెప్పింది వినీత.కానీ విక్కి కీ రెండు కాదు ఏదో ఉంది అని ఆలోచిస్తే అప్పుడు అతనికి బుర్ర లో వచ్చిన పేరు” గోల్డెన్ డక్ “, దాంతో” హే ఈ కథ అంతా మొదలు అయింది ఆ షిప్ వల్ల గోల్డెన్ డక్ ఆ షిప్ వచ్చాకే వీళ్ల లైఫ్ మారింది, అంతే కాదు రాజు intention ఈ కుటుంబం లో చిన్న జ్ఞాపకం కూడా వదలకుండా నాశనం చేయడం అందుకే వాడు ఆ షిప్ తోనే ఈ కథ నీ ముగించాలి అనుకున్నాడు” అని చెప్పాడు విక్కి దాంతో అందరూ అదే correct అనుకోని పోర్ట్ వైపు వెళ్లారు, అప్పటికే రాజు అక్కడ పోర్ట్ లో పూజా నీ షిప్ లో పడేసి ఒక బాగ్ నిండా ఉన్న Grenades jacket నీ తీసి అది బలవంతంగా పూజా కీ వేశాడు అప్పుడే ప్రకాష్ కార్ తో వేగంగా పోర్ట్ లోకి దూసుకొని వచ్చాడు ఆ వెంటనే వినీత, తన దెగ్గర ఉన్న 3 గన్ లు ఒకటి నిఖిల్ కీ, ఇంకోటి, విక్కి కీ ఇచ్చింది “జాగ్రత్తగా ఉండాలి అందరూ వాడు అసలే సైకో ఎమ్ చేస్తాడో తెలీదు అంతేకాకుండా పూజా ఏ పరిస్థితుల్లో ఉందో కూడా తెలీదు” అని చెప్పి కిందకి దిగింది వినీత.ప్రకాష్ వాళ్లకు కార్ నీ అడ్డం గా ఉంచి దాని మెల్లగ ముందుకు నడుపుతు వీళ్ల ముగ్గురిని కవర్ చేస్తున్నాడు అప్పుడు కార్ వెనుక ఉన్న నిఖిల్ పూజా కీ వేసిన జాకెట్ నీ చూడగానే ఎదురుగా ఉన్న రాజు వైపు కాల్పులు మొదలు పెట్టాడు దాంతో alert అయినా రాజు తన దగ్గర ఉన్న అడ్వాన్స్ గన్ తీసుకొని నిఖిల్ నీ కాల్చాడు దాంతో నిఖిల్ కాలు లో ఒక బుల్లెట్ చేతికి ఒక బుల్లెట్ తగిలి కింద పడ్డాడు ఆ తరువాత కార్ పైన కాల్పులు మొదలు పెట్టాడు, డీజిల్ ట్యాంక్ కీ బుల్లెట్స్ తగలడం తో కార్ లో మంటలు లేచాయి దాంతో ప్రకాష్ బయటికి దూకేసాడు, విక్కి నిఖిల్ నీ భుజాలకు వేసుకొని పక్కకు లాకూ వెళ్లాడు, వినీత ఒక container వెనక దాకున్ని రైట్ టైమ్ కోసం చూస్తోంది అప్పుడు విక్కి కూడా వినీత పక్కన కూర్చుని నిఖిల్ అక్కడ పడుకోబెట్టాడు, అప్పుడు ఆ షిప్ వైపు చూస్తే ఒక్కటే దారి ఉంది లోపలికి వెళ్లేందుకు అంతే విక్కి నిఖిల్ గన్ ప్రకాష్ వైపు వేసి, వినీత ని ప్రకాష్ నీ వేరు వేరు గా రాజు వైపు కాల్చమని చెప్పి రాజు బిజీగా ఉన్నపుడు, షిప్ లోపలికి వెళ్ళాడు అప్పుడు రాజు నీ షూట్ చేయడానికి పొజిషన్ చూస్తుంటే పక్కన ఎవరో కదిలినటు అనిపిస్తే చూశాడు విక్కి వెంకట రాయుడు నీ కట్టేసి పూజా కీ వేసినట్లు రాయుడు కీ కూడా జాకెట్ వేసి ఉంచాడు “హే అసలు ఏమీ జరుగుతుంది ఇక్కడ ఆ పిచ్చి నా కొడుకు నను ఎందుకు కిడ్నాప్ చేశాడు” అని అడిగాడు రాయుడు “వాడు పిచ్చి నా కొడుకు కాదు నీ కొడుకే” అని అన్నాడు విక్కి “ఏంటి నువ్వు అనేది” అని ఆశ్చర్యంగా అడిగాడు రాయుడు “వాడు నువ్వు ప్రేమించి, నమ్మించి, చంపించీన్న అరుణ కొడుకు “అని అసలు విషయం చెప్పాడు విక్కి.దాంతో రాయుడు ఆలోచనలో పడ్డాడు అప్పుడు విక్కి కీ ఒక ఆలోచన వచ్చింది కావాలి అని రాజు కీ మిస్ అయ్యేలా పక్కకు కాల్చి దొరికి పోయాడు అప్పుడు రాజు విక్కి వైపు రాగానే రాయుడు కళ్లలో నీళ్లు తిరిగాయి” బాబు నేను పాపం చేశాను రా ప్రేమ పేరుతో మీ అమ్మ నీ మోసం చేసి వాడుకున్నా, తరువాత నా తప్పు ఎక్కడ బయటకు వస్తుందో అని బయటపడి తనని చంపించా నిన్ను అనాధ నీ చేసి కళ్ల ముందే అయిన వాళ్లు ఉన్న వాళ్లు నా వాళ్లు అని చెప్పుకోలేని దీన స్థితిలో నిన్ను పెరిగేలా చేశాను నను క్షమించు రా “అని కళ్లలో నుంచి నీళ్లు ధారాళంగా కార్చాడు, దాంతో రాజు మనసు మెల్లగ కరిగింది వెంటనే తన తండ్రి నీ పైకి లేపి గుండెలకు హత్తుకున్నాడు ఆ తర్వాత ఇద్దరూ అలా ఒకరి కౌగిలి లో ఒక్కరూ ఒదిగి పోయిన టైమ్ లో విక్కి మెల్లగ వెళ్లి పూజా జాకెట్ విప్పి తనని షిప్ లో నుంచి బయటకు తోసేసి ఆ జాకెట్ నీ రాజు మీదకు విసిరాడు దాంతో రాయుడు వెనకు జరిగి “ఇప్పుడు కాల్చండి” అని గట్టిగా అరిచాడు “రేయి పిచ్చోడా నా వారసులన్ని చంపి నా పెళ్లం నీ చంపావూ ఎలా నిన్ను నా కొడుకు నీ చేసుకుంటా అనుకున్నావ్ రా ఉంచుకున్నా దానికి పుట్టినోడా” అని రాజు మీద విషం కకాడు రాయుడు రాజు ఆలోచనలో ఉండగా ఒక బుల్లెట్ వచ్చి అతని కడుపులో దిగింది ఇంకోటి అతని తొడలో దిగింది, విజయ గర్వం తో రాయుడు విక్కి వైపు చూసి” హే వచ్చి కట్లు విప్పు “అన్నాడు” కన్న కొడుకుని చంపడానికి రెడీ అయినోడివి నను వదులుతావా అందుకే ఇప్పుడు నీ కొడుకు చేతిలోనే చావు” అని విక్కి వెళ్లుతుంటే అక్కడే ఉన్న తాడు విక్కి కాలు కీ అడ్డు వేసి కింద పడేలా చేసి గన్ తో రాయుడు నుదుటి లో బుల్లెట్ దింపాడు రాజు.తరువాత మెల్లగ లేచి విక్కి వైపు వెళ్లి విక్కి నీ షూట్ చేయబోయాడు అంతే విక్కి రాజు కాల దగ్గర ఉన్న జాకెట్ లో ఒక grenade పిన్ పీకీ రాజు గుండె ల మీద కాలు తో కొట్టి షిప్ మీద నుంచి దుక్కేసాడు అంతే షిప్ మొత్తం పేలి పోయింది ఆ తరువాత అందరూ కలిసి హాస్పిటల్ కి వెళ్ళారు.1 నెల తరువాతవినీత తన జాబ్ కీ రాజీనామా చేసి విక్కి తో పాటు ముంబాయి కీ ప్రయాణం అయ్యింది, అదే దారిలో వాళ్లు “RR & CO” కంపెనీ దెగ్గర ఆగ్గి ఆ రోజే కంపెనీ చైర్మన్ గా ఆస్తులు మొత్తం తన మీదకు మార్చుకుంది పూజా, తనకి support గా ప్రకాష్, నిఖిల్ ఇద్దరు ఉన్నారు వాళ్లకు కంగ్రాట్స్ చెప్పి ఇద్దరు ముంబాయి కీ వెళ్లారు ఆ తర్వాత తన లైఫ్ జరిగిన ఆ వారం రోజుల అనుభవం నీ తన కథ గా రాసాడు విక్కి, ఆ తరువాత అతని బాస్ శేఖర్ కింద మీద పడి డైరెక్టర్ రోహిత్ శెట్టి నీ ఒప్పించి ఆ కథ తో సినిమా మొదలు పెట్టారు.6 నెలల తరువాతవిక్కి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కథ చివరి లో బలంగా ఒక scene ఉండాలి అని ఆలోచిస్తూ ఉండగా అతని ఫోన్ మొగ్గింది పూజా నుంచి ఫోన్ “ఏంటి ఇప్పుడు ఫోన్ చేశారు మేడమ్ గారు” అని అడిగాడు విక్కి “రేయి 6 నెలలు అవుతున్నా ఇంకా ఆ రాజు బాడి దొరకలేదు అని పోలీస్ లు అంటున్నారు వాడు బ్రతికే ఉన్నాడు అన్ని భయం భయంగా ఉంది” అని చెప్పింది పూజా, “నువ్వు భయపడవద్దు ధైర్యంగా ఉండు” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు విక్కి, 5 నిమిషాలకు ఒక unknown number నుంచి ఫోన్ వచ్చింది “హలో ఎవరూ “అని అడిగాడు” నీ చావును “అని అవతలి నుండి ఒక బీకర గొంతు వినిపించింది.ఆ చుట్టుపక్కల అంతా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి విక్కి కీ” పూజా నీ చంపాలి అంటే ముందు నువ్వు చావాలి నేను వస్తున్నా” అని అవతలి నుండి చెప్పాడు రాజు “I am ready” అని ఫోన్ పెట్టేసాడు విక్కి (రాజు నీ ఆ రోజు విక్కి షిప్ పేలినపుడు కొట్టాడు కదా అప్పుడు రాజు అక్కడ ఉన్న ఒక రాడ్ కీ కొట్టుకొని సముద్రంలో పడ్డాడు ఆ తర్వాత ఒక జాలరి వాళ్ల వల్లలో చిక్కుకున్నాడు అతని హాస్పిటల్ లో చేర్పించారు 6 నెలలు కొమ్మా లో ఉన్నాడు ఇప్పుడే లేచ్చాడు) రాజు కూడా ఫోన్ పెట్టేసి గన్ లోడ్ చేస్తు హాస్పిటల్ మొత్తం బాంబులతో పేలుస్తు బయలుదేరాడు