ఇది ఒక ప్రేమకథ.ఇందులో మీరు ఆశిస్తున్న విధంగా ఎరోటిక్ సన్నివేశాలు ఉండవు. ఈ విషయాన్ని గ్రహించి నన్ను క్షమించగలరు. ఇది నా మొదటి కథ.దీనిని మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
శ్రావణ్ ఊరెళ్లి నాలుగు రోజులయ్యింది. రెండు రోజుల్లో తిరిగొస్తానన్నాడు, ఇంకా రాలేదు. ఇలా ఆలోచిస్తూ ఆ రాత్రికి నిద్రపోయాను. ఉదయాన్నే లేచి కాలేజికి రెడీ అయ్యి లంచ్ బాక్స్ తీసుకుని బస్సు ఎక్కేసాను. As usual గా విండో దగ్గర కూర్చున్నాను. బస్సు కాలేజిలోకి వచ్చేసింది. అందరు దిగేస్తున్నారు. సరిగ్గా నేను లేవబోతున్న సమయానికి నా మొబైల్ మోగింది. చూస్తే శ్రావణ్ కాలింగ్. నాకు చాలా కోపం వచ్చింది. కాల్ lift చేసి చడామడా అరిచేశాను.అటువైపు నుండి మౌనం. నేను కాసేపు గ్యాప్ ఇచ్చాను. అప్పటికీ తను ఇంకా ఏమి మాట్లాడలేదు. “హల్లో శ్రావణ్” అన్నాను.
“అయిపోయిందా?” అన్నాడు.
“అవ్వలేదు” అన్నాను కోపంగా.
“సరే కానీ” అన్నాడు వెటకారంగా.
నాకు కోంచెం నవ్వు వచ్చింది ఆ మాట వినగానే. కానీ ఆ నవ్వును ఆపుకుంటూ “నాతో మాట్లాడొద్దు” అన్నాను లేని కోపం నటిస్తూ.
“సరే కాల్ కట్ చేయమంటావా?” అన్నాడు.
“చంపేస్తాను కాల్ కట్ చేస్తే” అన్నాను.
“మాట్లాడనంటావు అంతలోనే కాల్ కట్ చేస్తే చంపుతానంటావు. ఇలా ఐతే నీతో కష్టం సమీర. నన్ను మర్చిపో. నేను కూడా నిన్ను మర్చిపోతాను” అన్నాడు.
“ఇదిగో ఈ మాటలే నాకు కోపం తెప్పించేవి” అన్నాను.
“అదంతా వదిలెయ్. ఎలా ఉనావ్ సమీరా?”
“నా గురించి పక్కనపెట్టు నువ్వెలా ఉన్నావ్ రా? వెళ్తే ఫోన్ కూడా చెయ్యవు నువ్వు. నేను చేస్తే ఎప్పుడూ స్విచ్ ఆఫ్ అని వస్తుంది”
“మన ఊరి గురించి తెలుసు కదా నీకు? అక్కడ network లేదు.సారీ రా” అన్నాడు.
“ఈ సారీలకేమీ తక్కువ లేదు” అన్నాను.
అటువైపు నుంచి మౌనం. “శ్రావణ్” అన్నాను.
“మ్మ్” అన్నాడు తను.
“నిన్ను చూడాలని ఉంది రా”
“నాకు కూడా నిన్ను చూడాలని ఉంది. కానీ నువ్వేమో అటువైపు తిరిగి మాట్లాడుతున్నావు”
“ఏం మాట్లాడుతున్నావు?” అర్థం కాక అడిగాను.
“వెనక్కి తిరుగు” అన్నాడు.
తిరిగి చూడగానే అప్పుడే బస్సు వెనుక డోర్ లో నుండి ఎక్కి నాకు కొద్ది దూరంలో నిలుచున్నాడు. వాన్ని చూడగానే చాలా ఆనందమేసింది. బస్సు కమ్మీలను అడ్డుకుంటూ పరుగెత్తుకుంటూ వాడి దగ్గరకు వెళ్లి వాన్ని గుండెలమీద చిన్నగా పిడిగుద్దులు గుద్దుతున్నాను. శ్రావణ్ నా దెబ్బలను కాచుకుంటూ “అబ్బా ఆగవే రాక్షసీ” అన్నాడు.ఇక కొట్టడం ఆపేసి “రెండు రోజుల్లో వస్తానని ఇప్పుడా వచ్చేది?” అన్నాను. కాస్త ఏడుపు ముఖంతో.
“సారీ…..” అంటూ గుంజిళ్లు తీయసాగాడు. నేను వాడి భుజం మీద చిన్నగా కొట్టి “చాల్లే” అన్నాను అలిగినట్లు.
“అలిగితే ఎంత బాగుంటావో తెలుసా?” అన్నాడు.
“నాకు తెలీదు” అని వెనక్కి తిరిగి నడవసాగాను. వాడు నా వెనుక వస్తూ “నాక్కూడా తెలీదు” అన్నాడు నా చెవిలో.
“నిన్నూ…..” అంటూ వాడి వైపు తిరిగి చెయ్యెత్తాను.
“సారీ…సారీ…” అంటూ వెనక్కి వంగాడు.
అలా వాణ్ని చూడగానే నవ్వొచ్చేసింది. చిన్నగా నవ్వేసాను.
“ఇది చూడాలని ఇంత సేపు అనుకుంటూ ఉంటే నువ్వేమో….” అన్నాడు.
“ఏం చూడాలని?” అన్నాను.
నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని “నవ్వుతున్న నీ అందమైన ముఖం చూడాలని” అన్నాడు.
నేను వాన్ని గట్టిగా హగ్ చేసుకున్నాను. వాడు కూడా నా చుట్టూ చేతులు వేస్తూ “లవ్ యూ సమీర” అన్నాడు. నాకు ఏడుపొచ్చేసింది.
“లవ్ యూ టూ” అన్నాను కాస్త ఏడుపు గొంతుతో. నా గొంతులో తడి అర్థమైనట్లు ఉంది నా తలెత్తి చూసి కాస్త నవ్వుతూ “ఇదిగో ఏడ్చావంటే వెళ్లిపోతాను చెప్తున్నా” అన్నాడు.
నేను వాన్ని నా వైపు లాక్కొని ఇంకా గట్టిగా హగ్ చేస్కుంటూ నవ్వుతూ “చంపుతా” అన్నాను.
“సరేగానీ క్లాస్ కు వెళ్దామా? అసలే నాకు 4 డేస్ ఆబ్సెంట్”
నేను నవ్వుతూ “అప్పుడేనా?” అన్నాను.
“అబ్బా చాల్లేవే” అన్నాడు నన్ను బలవంతంగా విడిపించుకుంటూ.
“నువ్వెప్పుడూ ఇంతే బావా” అన్నాను గోముగా.
అవును శ్రావణ్ నా బావ. నా గురించి చెప్పాలంటే నాకు శ్రావణ్ అంటే ప్రాణం. నా పేరు సమీర. నాదీ, శ్రావణ్ దీ ఒకే ఊరు. అది కర్నూలు జిల్లాలో ఒక ప్రాంతం. మేము ఇద్దరం హైదరాబాదులోని ఒక ఇంజినీరింగ్ కాలేజిలో సెకండ్ ఇయర్ చదువుతున్నాము.
హైదరాబాద్ లోని ఒక ఏరియాలో నేను హాస్టల్లో ఉంటున్నాను. బావేమో అదే ఏరియాలో సింగిల్ గా రూంలో ఉంటున్నాడు.
ఇద్దరం బస్సు దిగి క్లాసులోకి వెళ్లాం. నేను ముందు, నా వెనుక బావ క్లాసులోకి వెళ్లిపోయాం. నేను వెళ్లి కావ్య పక్కన కూర్చున్నాను.(కావ్య మా క్లాస్ మేట్). కావ్య నన్ను చూసి నవ్వింది.
“ఎందుకు నవ్వుతున్నావే?” అని అడిగాను.
“నువ్వు చాలా అదృష్టవంతురాలివి” అంది.
“ఎందుకు?” అని ప్రశ్నించాను.
“శ్రావణ్ లాంటి వాడు నీకు బావైనందుకు” అంది.
నాకు కొంచెం గర్వంగా అనిపించింది.
“నువ్వెలా చెప్తున్నావే నా అదృష్టం గురించి?” అని అడిగాను.
“ఏం లేదు. నువ్వంటే శ్రావణ్ కి చాలా ఇష్టం కదా అందుకే” అని అంది.
ఆ మాట వినగానే నాకు చాలా ఆనందమేసి సడన్ గా బావ వైపు చూశాను. వాడు వాడి ఫ్రెండ్స్ తో నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇక ఆ రోజుకి క్లాసెస్ అయిపోయిన తరువాత నేను బావ సెల్ కు “నీతో మాట్లాడాలి కాసేపు ఆగు” అని మెసేజ్ పెట్టాను. అందరూ వెళ్లిపోయారు. క్లాస్ లో నేను బావ మాత్రమే ఉన్నాం.
“ఎందుకే ఆగమన్నావు?” అన్నాడు బావ.
“నీతో మాట్లాడాలని”
“ఏంటో చెప్పు”
నేను వెళ్లి బావ పక్కన కూర్చున్నాను. వాడి ఎడమ చేయి చంక కిందుగా నా చేతిని పోనిచ్చి, వాడి ఎడమ చేతిని పట్టుకున్నాను. నా తలను వాడి భుజంపై చిన్నగా వాల్చి “బావా” అన్నాను.
“మ్మ్” అన్నాడు.
“నా మీద కావ్యకి జెలసీగా ఉందంటా”
“ఎందుకు?”
“నీ వల్లే”
“నేనేం చేశాను” అన్నాడు లేవబోతూ.
“అబ్బా కూర్చో బావా” అన్నాను నా చేతిని ఇంకా గట్టిగా బిగిస్తూ.
“నేనేం చేసానో చెప్పు” అన్నాడు నన్ను చూస్తూ.
“నువ్వు దొరకడం నా అదృష్టం అంట. నీలాంటి బావ తనకి లేడని నేనంటే జెలసీ” అన్నాను.
“ఈ విషయం అందరికీ తెలుసు. కానీ అందరూ నాతో ఏమని అంటున్నారో తెలుసా?” అన్నాడు.
“ఏం అంటున్నారు?” అన్నాను అత్రుతగా.
“నీ టేస్ట్ ఎందుకు రా ఇంత బాడ్ గా ఉంది అని అంటున్నారు” అని అన్నాడు.
“నిన్నూ….. చంపేస్తాను” అంటూ బావ భుజంపై చిన్నగా కొరికాను.
“ఎందుకు కొరికావే రాక్షసీ?” అన్నాడు భుజంపై రుద్దుకుంటూ.
“వాళ్లలా అంటుంటే నువ్వేం మాట్లాడనందుకు” అన్నాను నా చేతులు వాన్ని వదిలేస్తూ.
“నేనేం మాట్లాడకుండా ఉండలేదు” అన్నాడు.
“ఏం అన్నావు?” అడిగాను ఇంకా ఆత్రుతతో.
బావ చిన్నగా జరిగి నా చెవిలో “విధి చేసే పనుల నుండి ఎవరూ తప్పించుకోలేరు అని చెప్పాను” అన్నాడు.
ఆ మాట వినగానే నేను వాన్ని కొట్టబోయాను. వాడు లేచి పరిగెత్తాడు. నేను లేచి వాడి వెనుక పరుగెత్తబోతూ నా మోకాలికి బెంచ్ తగలడంతో “అమ్మా” అని అరిచి అక్కడే కూర్చున్నాను. నా అరుపుతో వెనక్కి తిరిగి చూశాడు. నేను నా మోకాలు పట్టుకుని కూర్చున్నాను. నా దగ్గరికి పరుగెత్తుకు వచ్చి కింద రెండు కాళ్ల మీద క్కొర్చుని నా మోకాలిని తాకాడు. నేను వెంటనే బావ చెవిని పట్టుకుని పిండేస్తూ “ఇప్పుడు చెప్పు
ఏమన్నావో….విధి….ఇంకా ఏదేదో వాగావు?” అన్నాను.
“ఇస్స్….అబ్బా….రాక్షసీ నొప్పిగా ఉంది” అన్నాడు.
“మరేం పర్వాలేదు ఆ మాత్రం నొప్పి తెలియాలిలే” అన్నాను.
“నేనేదో జోక్ చేశానే వదులు” అన్నాడు.
“ఇప్పుడు చెప్పు ఏమన్నావో?” అన్నాను వాడి చెవిని వదిలేస్తూ.
దానికి తను “ఎవరూ నీ గురించి నా దగ్గర కామెంట్ చేయలేదు” అన్నాడు వాడి చెవిని రుద్దుకుంటూ.
“అంటే?” అన్నాను.
“ఇందాకా నీతో చెప్పిందంతా అబద్ధమే” అన్నాడు.
దానికి నేను “నన్ను ఎప్పుడూ ఏడిపించాలనుకుంటావు కదా నువ్వు?” అన్నాను నేను వాడి చేతి మీద చిన్నగా కొడుతూ. వాడు లేచి నిలబడి “ఇక వెళ్దామా?” అన్నాడు.
నేను టైం చూసి “కాలేజి బస్సు వెళ్లిపోయి ఉంటుంది. ఇప్పుడెలా?” అన్నాను.
“లేట్ అయ్యేలా చేసింది నువ్వు. నన్నడిగితే ఎలా?” అన్నాడు.
“సరేలే RTC బస్సులో వెళ్లిపోదాం” అన్నాను.
“రష్ బాగా ఎక్కువగా ఉంటుంది” అన్నాడు.
“అయితే రష్ తగ్గేవరకు ఇక్కడే ఉందాం” అన్నాను.
వాడు తల పట్టుకుని “నీతో చాలా కష్టం సమీరమ్మా” అన్నాడు.
“అవును చాలా కష్టం” అన్నాను నేను నవ్వుతూ.
వాడు నా వైపు నవ్వుతూ చూసి “నేను రష్ గా ఉన్నా బస్సులో వెళ్లిపోతాను” అన్నాడు.
(అలా అనేసి వాడు డోర్ దాకా వెళ్లాడు)
The post శ్రావణసమీరాలు appeared first on Telugu Sex Stories.