ఓన్లీ ఒన్ చాన్స్

“నో…” తనలో శక్తీనంతటినీ కూడగట్టుకొని గట్టిగా అరిచింది పద్మజ.
“ప్లీజ్… ఉద్రేకపడకు… కూల్ గా ఆలోచ్హించు” ప్రాధేయపడుతున్నట్టు అడిగాడు రామారావు.
“మీరనే మాటలకు ఉద్రేకం కాకుంటే చల్లదనం ఎక్కడనుంచి వస్తుంది? వళ్ళు మండిపోతుంది” కోపములో పెదిమలు వణుకుతున్నాయి. ముక్కుపుటాలు అదిరిపడుతున్నాయి.
“అదికాదు పద్మా… ఒకటి ఆలోచించు. రేపు మనకు పిల్లలు పుట్టారనుకో ఈ రెండువందల జీతంతోనూ వాళ్ళను ఎంత అభివృద్ధిలోకి తీసుకురాగలం అసలే పెరిగిపోతున్న జీవన వ్యయం, చాలీచాలని జీతపురాళ్ళు వచ్చే రెండువందలలోనూ యాభైరూపాయలు ఇంటికి పంపిస్తున్నానా, ఇక మనకు మిగిలేది నూట యాభై. నెలంతా వీటితో సర్ధుకుంటున్నాం తిండికి ఇంటి అద్దెకు మాత్రమే బొటాబొటిగా సరిపోతున్నాయి ఆరు నెలల నుంచీ నీకో మంచి టెర్లిన్ చీర కొనాలనుకుంటున్నా కానీ కొనలేకపోతున్నాను. కారణం?”
పద్మజ మాట్లాడలేదు.
ఇనుము ఎర్రగా కాలినపుడే సాగదీయాలని తెలుసు రామారావుకు.
“నీకు కనీసం రెండు మంచి చీరలైనా ఉన్నాయా? నాకో టెర్లిన్ షర్టైనా వుందా? ఇప్పుడే మన పరిస్థితి ఇలా వుంటే రేపు నలుగురు పిల్లలు పుట్టాక ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఆలోచించు”
“అందుకని” కోపంగా అరిచింది పద్మజ. ఊపిరి బరువుగా పీలుస్తుండడంవలన ఎత్తైన వక్షస్థలం ఎగిరెగిరి పడుతోంది.
“డోంట్ బి ఫూలిష్! దిస్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్ట్యునిటీ. నెలకు పన్నెండువందల జీతం, వెల్ ఫర్నిష్డ్ క్వార్టరుస్, ఓ కారు. ఇది, రేపు మన పిల్లల భవిష్యత్తుకు బంగారుబాట ఈ అవకాశాన్ని జారవిడుచుకున్నామంటే ఈ చాలీచాలని జీతంతో, ఈ మురికికొంపలో చరిత్రహీనుల్లా బ్రతకాలి. ఆలోచించు. ఇది సాధారణమైన అవకాశం కాదు. ఇప్పుడు కాళదన్నుకున్నామంటే… మళ్ళీ కావాలంటే రాదు”
“మీరు చేయాలనుకుంటున్నది కూడా సాధారణమైన పనేం కాదు. ఒకసారి కాలు జారానంటే అది శాస్వత పతనమే. చరిత్రహీనంగానైనా బ్రతకగలను కానీ పధవిహీనంగా బ్రతకలేను”
మొహం ఎర్రబడింది. కళ్ళు ఎరుపెక్కి నిప్పులు కురిపిస్తున్నట్టుగా ఉన్నాయి.
అంత తీక్షణంగా ఉన్న పద్మజ మొహంలోకి చూడలేకపోయాడు రామారావు. తలవంచుకొని అన్నాడు. “పద్మా! నేనే ఒప్పుకున్నప్పుడు నీకంత బెట్టు ఎందుకు?”
“అవును… మీరు ఒప్పుకున్నారు నేను ప్రాణంలేని మట్టిబొమ్మను నాకో మనసూ వ్యక్తిత్వం లేవు” కోపంతో మాటలు రాలేదు పద్మజకు.
“అది కాదు నా ఉద్దేశ్యం మన పురాణాల్లో అథిది కోరితే”
“పుక్కిటి పురాణాలు చెప్పొద్దు” కోపంతో వణికిపోతుంది పద్మజ.
“పోనీ ఇప్పటి ప్రపంచంలో జరిగేది ఆలోచించు. భర్తకు తెలియకుండా ఎంతమంది ఆడవాళ్ళు పరాయివాళ్ళ దగ్గర పడుకోవటంలేదు. ఎంతమంది అడ్డదారులు తొక్కడంలేదు, అటువంటప్పుడు..”
“పరాయివాడి దగ్గర పడుకోమనడానికి మీకు సిగ్గెలా లేకపోయింది”
“ఇప్పటి నాగరిక ప్రపంచంలో జరుగుతున్నది అదే”
“అవును మొగుడు చవటై, ఒళ్ళు తీటెక్కితే, ఆ తీట తీర్చుకుంటున్నారు. నాకంత తీటగా లేదు”
“పద్మా! ఇక్కడ మనకు కావలసింది సుఖం సంగతి కాదు. మన భవిష్యత్తు ఈ కుళ్ళు బ్రతుకుల్లోంచి, ఈ వెధవ జీవితంలోంచి బయటపడాలి. గోల్డెన్ ఫ్యూచర్ కోసం, మన పిల్లల కోసం ఇది. త్యాగమే అనుకో… ఒక్కసారి”
“కాలుజారిన తరువాత ఒక్కసారైనా పదిసార్లైనా ఒకటే”
“డియర్! నిన్నెప్పుడూ ఏదీ అడగలేదు. ఇంకెప్పుడూ ఏమీ కోరను. ఈ ఒక్కసారి నా కోసం మన భవిష్యత్తుకోసం ఒప్పుకో. పైగా ఈ సంఘటనను గుర్తుకుతెచ్చే మాటలు నేంప్పుడూ అనను. అసలు జరిగినట్టే అనుకోను ప్లీజ్”
“ఛీ! మీరెందుకిలా మారిపోయారు? మిమ్మల్ని చూస్తుంటే నాకసహ్యం వేస్తుంది. శీలాన్ని పోగొట్టుకోమనడానికి మీకు నోరెలా వస్తుంది?”
ఇది నోరు కాదు చెప్పేది. ఆవేదన ఈ దుర్భర జీవితంలోని నిసృహ మనం జీవిస్తున్నది రొచ్చుగుంటలో. ఈ రొచ్చులోంచి బయటపడాలి. పూలబాటలో పయనించాలి మన బ్రతుకులు. కొంచెం శాంతంగా ఆలోచించు. ఒకానప్పుడు నీ కోసం నా ఫ్యూచర్ ను కాలదన్నుకున్నాను. ఫలితంగా ఈ మురికి బ్రతుకులో పడ్డాను. ఇప్పుడు మళ్ళీ అటువంటి అవకాశమే వచ్చింది. ఈ సారి వదులుకోలేను. ఏ సరదాలూ తీర్చలేని కనీసం కోర్కెలే నెరవేర్చలేని ఈ బురదగుంటలో బ్రతకలేను. ప్లీజ్ నా కోసం ఈసారికి ఒప్పుకో”
పద్మజ మాట్లాడలేదు.
“అప్పుడు నీ కోసం త్యాగం చేసాను. ఇప్పుడు నా కోసం నీవు చేయాలి, ఆలోచించు” విసురుగా బయటకు వెళ్ళిపోయాడు రామారావు.
మంచం మీద కూలబడి వెక్కి వెక్కి ఏడుస్తోంది పద్మజ.
రామారావుకు ఇప్పుడు ఇరవైఎనిమిదేళ్ళు. నాలుగు సంవత్సరాలనుంచి “స్ప్రే అండ్ కిల్” ఇన్సెక్టిసైడ్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. జీతం రెండు వందలు. పొడుగ్గా, సన్నగా, తెల్లగా ఉంటాడు. గుండ్రని మొహం, ఉంగరాల జుత్తు, పొడుగాటి ముక్కు చూడ్డానికి అందంగానే ఉంటాడు.
ఐదేళ్ళ క్రితం రామారావుకూ ఇప్పటి రామారావుకీ చాలా తేడా ఉంది.
ఐదేళ్ళ క్రితం రామారావు ఎం.ఏ ఎకనామిక్స్ లో యూనివర్సిటీ ఫస్టు. గోల్డ్ మెడల్ విన్నర్. అప్పుడు మనిషి మిసమిసలాడుతుండేవాడు. భవిష్యత్తును బంగారు బాటగా ఊహిస్తూ, టెక్నికలర్ లో కలలు కనేవాడు.
ఇప్పుడు…
భూతకాలం పెనుభూతమై, భవిష్యత్తు పెను చీకటిల భయంకరమై కనిపిస్తుంటే, చాలీచాలని జీతంతో వాస్తవం వంటి చేదు జీవితాన్ని రుచి చూస్తున్నాడు వర్తమానంలో.
The post ఓన్లీ ఒన్ చాన్స్ appeared first on Telugu Sex Stories.