“ఎవరబ్బా నువ్వు , మా ఊర్లో నా మాట తప్ప ఎవ్వరిని దగ్గరకు కూడా రానీయదు , దాన్ని ఒక్క దెబ్బకు పండుకో బెట్టినావే ”
“మీ లాగే రైతు బిడ్డనే లో , కాక పొతే ఊర్లో పశువులకు వచ్చిన రోగాన్ని నయం చేయడానికి వచ్చిన డాక్టర్ ని”
“అయ్యో నీ చేతికి ఆ నేత్తరెంది , ఒమ్మే సరోజా , కమలమ్మ నడిగి పసుపు పట్రా ” అంటూ నేను గిరవాటేసిన అమ్మాయికి పురమాయించాడు.
ఆ అమ్మాయిని పక్కకు లాగినప్పుడు వెనుక గోడ కొట్టుకొని మోచెయ్యి దోక్కొని పోయింది దాని పర్యవసానమే ఈ రక్తం. ఈ లోపుల ఆ ముగ్గురు బిందెల అమ్మాయిలు , ఈ సరోజ ఆ ఇంటి కమలమ్మా , ఆ చుట్టూ పక్కల ఇంకా ఓ 5 , ఆరు మంది అంతా గుంపుగా నా దగ్గరకు వచ్చారు.
“సారూ ఇక్కడ కుచోండి నేను పసుపు రాస్తా ” అంటూ కమలమ్మ వాళ్ళ ఇంటి ముందు మంచం వైపు చెయ్యి చూపింది సరోజ అనే అమ్మాయి. పసుపుతో పాటు వాళ్ళ ఇంట్లో ఓ పాత గుడ్డ తెచ్చి నా చేతిని తుడిచి దాని మీద పసుపు అంటించింది.
తను అంటించిన కొద్ది సేపటికి రక్తం కారడం ఆగిపోయింది. పసుపు రాస్తుండగా కొద్దిగా దగ్గర నుంచి చూసాను సరోజను. బహుశా 19 , 20 ఉండవచ్చు , చూడగానే మరిచిపోయే మొహం కాదు. పెద్ద పెద్ద కళ్ళు , సొంపైన వళ్ళు , కానీ అమ్మాయి అంత కలర్ లేదు. అన్నీ సరియైన కొలతలతో తయారుచేసినట్లు గా ఉంది. లంగా ఒణి వేసుకొని ఉంది, ఆ రెండు లేని చోటే నా చెయ్యి పడింది అనుకోని మనస్సులో ఓ గిలిగింత బయలు దేరింది.
పొద్దున్నే ఓ డాక్టర్ వచ్చాడు మా ఇంటికి , మా అవును చూస్తున్నాడు మీరు అయన కలిసి వచ్చారా” అంది సరోజ
“అయన కోసమే బయలు దేరాను ”
“అయితే రండి నేను తీసుకెళతా ” అంటూ తన వెనుక నేను వాళ్ళ ఇంటికి వెళ్లాను.
వాళ్ళ అవును ట్రీట్ చేస్తున్న డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే
నన్ను చుసిన తను
“నాకు తెలిసీ ఈ మందు పని చేయవచ్చు అనుకోంటున్నా కానీ క్లోజ్ గా గమనించాలి ప్రతి గంటకు, ప్రస్తుతానికి stable గానే ఉంది , నువ్వు ఇక్కడ ఉండు నేను వెళ్లి స్నానం చేసి వస్తా” అని చెప్పి తన సర్పంచి ఇంటికి వెళ్ళాడు.
ఇంట్లోంచి రెండు గ్లాస్ లు టీ తీసుకొచ్చింది సరోజ
“ఆ సారూ ఎక్కడ , టి తెచ్చానే ” అంది నా కో గ్లాస్ ఇస్తూ.
“తను వచ్చే కొద్దీ లేట్ అవుతుంది , మీరు తాగండి ” అన్నాను తనను కొద్ది సేపు అక్కడే ఉంచాలనే ఉద్దేశం తో. కొద్దిగా కలుపు గోలుగా మాటలు కలిపే కొద్దీ తన 10 వరకు చదువుకుంది , ఆ పల్లెలో అంగన వాడి టీచర్ గా చేస్తుంది. ఈ ఆవు పాలు అమ్ముకుంటూ తను వాళ్ళ అమ్మా ఉన్న 2 ఎకరాల పొలాన్ని కౌలుకి ఇచ్చి జీవనం సాగిస్తున్నారని చెప్పింది.
తనతో మాట్లాడుతూ ఉంటే ఎదో దగ్గరైన ఫీలింగ్ రాసాగింది. తన అమాయకత్వమో లేక తన పెదాల మీద చెరగని చిరునవ్వో తెలియడం లేదు.
గంట గంటకు ఆవును పరిశీలిస్తూ, మద్యలో సరోజను మాట్లాడిస్తూ 1 గంట ఎప్పుడు అయ్యిందో తెలియడం లేదు.
“సారూ , మీరు మా ఇంట్లోనే భోంచేయండి , నేను మీకు కూడా వండేసా ” అంది. సర్పంచి వాళ్ళ పాలేరు రాగానే, మిగిలిన వాళ్ళను తీసుకొని వెళ్ళమని చెప్పి నేను సరోజ వాళ్ళ ఇంట్లోనే భోజనానికి కుచోన్నా.
“మీ టౌన్ లో లాగా పెద్ద పెద్ద వంటలెం చేయలేదు సారూ , అన్నము పప్పు మాత్రమె ” అంది వడ్డించింది. తనకు ఇంకా చదవాలని ఉంది , అందుకే ప్రైవేట్ గా డిగ్రీ కి రాస్తున్నా అంది.
“మీ అమ్మ నీకు పెళ్లి సంబందాలు చూడలేదా ” అన్నాను
“చూస్తే మాత్రం నన్ను ఎవరు చేసుకుంటారు సారూ , మా కులంలో సేద్యగాడిని చేసుకోవాలన్నా లక్షలు లక్షలు కావాలి కట్నం , దానికి తోడూ నా కలర్ చూసావా , ఈ కలర్ చూసి వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెనక్కు వెళ్తున్నారు ”
“కలర్ ఏమన్నా కొరుక్కొని తింటారా ఏంటి ? , నీకేం నువ్వు చూడ్డానికి చాలా బాగుంటావు ”
“మీరు ఎదో నా మొహం మీద అనకూడదని అలా అంటున్నారు గానీ, ఈ కలర్ ఎవరికీ నచ్చుతుంది సారూ ”
“ఎం కాదు నీ కున్న అందానికి ఎవరైనా కళ్లకు అద్దుకొని చేసుకొని పోతారు” అన్నను ఎం అనాలో తెలియక
“మీరేం నన్ను పొగడకండి సారూ నాకు ఇవన్నీ మామూలే , ఎదో ఈ ఆవుకు బాగై తే దాని మీద తెచ్చిన బాకీ అయినా తీరితే బాగుండు”
“మీ అవుకు ఎం కాదు , చూస్తుండు రేపటి కళ్ళా అది మాములుగా చేసే బాధ్యత మాది ” అన్నను తను వేసిన గడ్డ పెరుగు అన్నం లో కలుపుతూ.
“మీ పుణ్యమా అని అది బాగైతే , అంతే చాలు సారూ ”
“నీ కు వంట చేయడం బాగా వచ్చాను కొంటా , చాలా బాగా చేసావు పప్పు ” అన్నాను
“పల్లెలో ఉండే వాళ్లం మాకు అన్ని పనులు వచ్చు సారూ , మేము చేసుకోక పొతే ఎవరు చేసి పెడతారు మాకు” అంటూ తిన్న ప్లేట్ తీసేసింది.
తనను చుసిన దగ్గర నుంచి నా బుర్రలో ఎదో తెలియని ఆలోచనలు తిరగ సాగాయి. సాయంత్రానికి సరోజ వాళ్ళ ఆవు మెల్లగా గడ్డి మేయడం మొదలు పెట్టింది.
అవుకు వ్యాది తిరుగు ముఖం పట్టింది , కానీ నా బుర్రలో సరోజ మీద ప్రేమ అనే జ్వరం మొదలైంది. భోజనం తరువాత నేను సరోజ అవును గమనిస్తూ అక్కడే ఉండి పోయాను.
సాయంత్రానికి నా బుర్రలో సరోజకు, కాంతి కి కంపారిసన్ మొదలైంది. నా కళ్లకి కాంతి కంటే సరోజ అందంగా కనబడ సాగింది. తనకు జీవితం లో ఓ గోల్ అంటూ ఉంది , కష్టపడి పైకి రావాలనుకుంటుంది. డబ్బు విలువ తెలుసు తనకు , కానీ శరీరం కలర్ లోనే ఇద్దరు చాలా తేడా , అలాగే మనసులో వాళ్ళ ఆలోచనలో ఇద్దరు తెలుపు నలుపు కు ఉన్నంత తేడా గా ఉన్నారు.
రాత్రి మేము అందరూ సర్పంచి ఇంట్లో సమావేశమై , అన్నీ చర్చించు కొన్న తరువాత, సరోజ వాళ్ళ అవుకు వాడుతున్న మెడిసిన అన్నిటికి వాడాలని నిర్ణయించుకున్నాము.
నేను రాత్రిళ్లు సరోజ వాళ్ళ అవును గమనిస్తూ ఉంటాను అంటూ సరోజ వాళ్ళ ఇంటికి వచ్చాను. పొలానికి వెళ్ళిన వాళ్ళ అమ్మ వచ్చినట్టు ఉంది , నేను వేల్ల గానే.
“మా అవుకు బాగై నట్లేనా సారూ”
“బాగై నట్లే కానీ రాత్రంతా దాన్ని గంటకో సారి చూస్తూ ఉండాలి ” అన్నాను
“అయితే మీరు ఇక్కడే పడుకోండి నేను మంచం పరుపు ఇక్కడే వేయిస్తా , సరోజా , సారూ ఇక్కడే పడుకొంటాడంట ఆ మంచం పరుపు బైట వెయ్యి ” అంది.
తను మంచం పరుపు బైట వేయగానే దాని మీద కూచొని పిచ్చా పాటి మాట్లాడుతూ ఉండగా సరోజ టించర్ తో బయటకు వచ్చింది. మా యమ్మ టించర్ తెప్పించింది ఆ చేతికి కొద్దిగా పట్టించండి తొందరగా తగ్గిపోతుంది అంది కాటన్ , టించర్ మంచం మీద పెడుతూ
“నువ్వు పుయ్యి ఆయప్ప ఎలా పుసుకోంటాడు ” అంటూ వాళ్ళ అమ్మా తనను పురమాయించింది. నా చేతిని పట్టుకొని పసుపు మీద ఆ టించర్ అద్దుతూ నోటితో అక్కడ గాలి ఊదుతూ , అట్ట కట్టిన పసుపును తీసేసింది.
తను చేసే పనిలో ఓ పద్దతి , వైనం కనబడసాగాయి , బహు శా నేను తనను ఇస్టపడుతుండడం వలన నెమో. పాడుకొనే ముందు ఓ గ్లాసు పాలు ఇచ్చింది తాగమని.
ఆ తరువాత రెండు రోజులు వేగంగా జరిగి పొయ్యా యి , మేము వాడిన ఆ కొత్తరకం మందుకు రో గాన పడ్డ పశువులన్నీ కోలుకున్నాయి. మండలం లో ఉన్న డాక్టరు కు ఆ మందులు స్టాక్ తెప్పించి ఉంచ మని చెప్పి మా క్యాంపు ను క్లోజ్ చేశాము.
రెండో రోజు , సరోజ కు చెప్పాను తనంటే ఇష్టం అని, మూడో రోజు వాళ్ళ అమ్మ పొలానికి వెళ్ళినప్పుడు దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకున్నాను , తను నా చేతుల్లో ఒదిగి పోతూ నాకు సరెండర్ అయ్యింది. కానీ ఎందుకో అంతకంటే ముందకు వెళ్ళాలనిపించ లేదు.
నా కౌగిట్లో ఉండగా తనతో అన్నాను “నేను వెళ్లి మా అమ్మా వాళ్ళను పంపుతాను చూసుకోవడానికి , మీ అమ్మకు నువ్వు చెప్పు ” అన్నాను.
“పెళ్లి అయ్యాక మా అమ్మ మనతోనే ఉంటుంది తనను చూసుకోవడానికి ఎవరు లేరు” అంది
“అలాగే , మీ అమ్మా , మా అమ్మా ఇద్దరు మన దగ్గరే ఉంటారు , ఇంకా కోరికలు ఏమైనా ఉన్నాయా అమ్మాయి గారికి”
“నేను ఇంకా చదువుకోంటా”
“మంచిది, ఇంకా”
“మా దగ్గర డబ్బులు ఏమి లేవు , నేను ఒక్క దాన్నే కూతుర్ని , కాబట్టి మా పొలం నాకే వస్తుంది , ఇంత కంటే కట్నం ఇవ్వలేదు మా అమ్మ”
“నాకు పైసా కట్నం వద్దు, ఇంకా”
“పెండ్లి ఆడ పిల్ల వల్లే చేయించాల కదా , గ్రాండ్ గా చేయించ లేదు అమ్మ”
“అవసరం లేదు , కావాలంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొందాము సరేనా”
“సరే” అన్నట్లు తనే నా బుగ్గ మీద ముద్దు పెట్టి పంపింది .
ఆఫీస్ లో క్యాంపు రిపోర్ట్ సబ్మిట్ చేసి, ఆ రోజు సాయంత్రం కాంతి తో డిన్నర్ కు బయటికి వచ్చాను. ముందే డిసైడ్ చేసుకున్నా మనసులో తనకు చెప్పేయాలని తెలుపు కంటే నాకు నలుపే ఇష్టం అని( తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని).
అనుకున్న చోటు కు చేరుకున్న ఓ 20 నిమిషాలకు తను వచ్చింది పక్కన ఇంకో వ్యక్తి తో.
“హాయ్ , మీట్ మై ఫ్రెండ్ రాకేష్ ” అంటూ తనని పరిచయం చేసింది. తనతో నెక్స్ట్ వీక్ ఎంగేజ్ మెంటు అని చెప్పింది , నేను చెప్పాల్సిన మాటను తనే చెప్పడం వలన నా మనస్సుకు భారం తగ్గి నట్లు అయ్యింది.
డిన్నర్ ముగించు కొని తనకు వీడ్కోలు చెప్పి రూమ్ కు చేరుకున్నాను. ఒక 10 రోజులు ఆఫీస్ కు సెలవు పెట్టి ఇంటికి వెళ్లి అమ్మా వాళ్ళను తీసుకొని సరోజ ఉరికి వెళ్లాను.
అందరిని వొప్పించి వాళ్ళ ఊర్లో నే సింపుల్ గా గుళ్లో పెళ్లి చేసుకొని అటు నుంచి ఆటే సరోజను తీసుకొని హాని మూన్ వెళ్లాను.
ఇదండీ నా నలుపు తెలుపు కధ.
END
The post తెలుపు – నలుపు Part 3 appeared first on Telugu Sex Stories.