అదే… రాత్రికి మీరిక్కడే స్టే చేస్తారని—!
ఆరోజు జోరుగా వాన కురుస్తోంది. మర్నాడే యాన్యువల్ డే కావటం చేత మేమందరం ఆడిటోరియాన్ని ముస్తాబు చేసే పనిలో నిమగ్నమయ్యాం. మరో ప్రక్క బయట వర్షం గంట గంటకీ ఉదృతం అవుతున్నది. ఫెళఫెళమంటూ ఉరుములు, మెరుపులతో ఆకాశం నిండిపోయింది. నాకప్పగించిన పనిని ముగించి మా కో-ఆర్డినేటర్ వెంకట్ దగ్గరికి వెళ్ళి, “ఈ వర్షం చూస్తే ఇప్పట్లో ఆగేలా లేదే!” అన్నాను. “ఊ… అందులో సందేహం లేదు. నాకు తెలిసి ఈపాటికి రోడ్లన్నీ మోకాలు లోతు నీళ్లతో నిండిపోయి … Read more