తర్వాత రోజు:నేను నిద్ర లేచి మెల్లగా బాత్రూం లోకి వెళ్లాను. నా బట్టలు ఈ టీ షర్ట్ జీన్స్ తప్ప ఏమి లేవు. అలాగే బ్రష్ కానీ పేస్ట్ కానీ, సోప్ కానీ ఏమి లేవు. బయటకు వచ్చి చూసాను, మంచం మీద రాజ్ లేడు. అప్పటికి నిద్ర లేసి కిందకు వెళ్లినట్లున్నాడు.నేను కిందకు వెళ్లి చూస్తే రాజ్ సోఫాలో పడుకొని ఫోన్ చూసుకుంటున్నాడు.మెట్లదగ్గర నుంచే “రాజ్..” అని పిలిచాను. నా వైపు చూసి “ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు అన్నాడు…”నేను నవ్వి “రాజ్ నేనేమి తెచ్చుకోలేదు….బ్రష్ కానీ సోప్ కానీ…..”వెంటనే రాజ్ “గెస్ట్ రూమ్ లోకి వేళ్ళు, అక్కడ ఉంటాయి అన్ని. వాటర్ హీటర్ ఆన్ చేసుకో హాట్ వాటర్ కోసం…” అని చెప్పాడు.“టబ్, షవర్ ఏది కావాలన్నా వాడుకో…” అన్నాడు.నేను వెళ్లబోతుండగా “ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేసుకో రెడీ అయ్యేలోగా వస్తుంది” అని చెప్పాడు.ఇద్దరం బయట నుంచి యాప్ లో ఫుడ్ ఆర్డర్ చేసాము.ఒకే అని చెప్పి నేను పైన గెస్ట్ రూమ్ లోకి వెళ్లి చూసాను, బాత్రూమ్ చాలా అద్భుతంగా ఉంది. పెద్ద షవర్ దానికి ఒక గ్లాస్ డోర్, అలాగే బయట పెద్ద టబ్, హీటర్ అన్ని ఉన్నాయి. ఒక రూమ్ అంత పెద్దగా ఉంది బాత్రూం. నిన్న నేను అంతగా గమనించలేదు, పట్టించుకోలేదు.నేను ఫ్రెష్ అప్ అయ్యి, రూమ్ cupboard లో చూస్తే ఒక రెండు టవల్స్ పెట్టున్నాయి. నేనొక టవల్ తీసుకొని బాత్రూం లోకి వెళ్లి గాడి వేసుకొని బట్టలన్నీ విప్పేసాను.వాష్ బేసిన్ ముందు అడ్డమ్ ఉంటె ఒకసారి నాకు నేను పైన నుంచి కిందకి చూసుకున్నాను. నిజంగా చాలా అందంగా ఉన్నాను నేను. నా నడుముని చూసాను, చాలా చాలా సన్నగా నాజూకుగా ఉంది రాజ్ చెప్పిన్నట్లు. ఇలా నా నడుము గురించి చెప్పింది వరుణ్ తర్వాత రాజే.నేను ఆలోచించాను షవర్ వాడదామా, టబ్ వాడదామా అని. టబ్ ఎప్పుడు వాడలేదు కాబట్టి అదే వాడదామని అనుకున్నాను కానీ నాకు ఎలా ఆపరేట్ చేయాలో తెలియలేదు.నా బట్టలు వేసుకొని, రాజ్ ని హెల్ప్ అడుగుదామని కిందకు వెళ్లాను. ఈ లోపల మెట్ల మధ్యలో రాజ్ కలిసాడు.“ఏంటి అప్పుడే రెడీ అయిపోయావ్ ??” అన్నాడు“ఇంకా లేదు…నాకు బాత్రూం లో ఎలా బటన్స్ ఆపరేట్ చేయాలో తెలియటం లేదు…..” అన్నాను.తను నా చేయి పట్టుకొని పైకి తీసుకొని వెళ్ళాడు. తను బాత్రూమ్ లో నాకు ఎలా అన్నిటిని వాడాలో అంత చూపించాడు.ఈ లోపల నా ఫోన్ మోగింది. బయటకు వెళ్లి చూస్తే అనిల్ కాల్ చేస్తున్నాడు. నేను కట్ చేసాను. నేను బాత్రూం లోకి వెళ్తుండగా ఒక సౌండ్ వచ్చింది ఫోన్ నుంచి. చూస్తే అనిల్ “urgently కాల్ మీ” అని మెసేజ్ పెట్టాడు.నాకు భయం వేసి అనిల్ కి ఫోన్ చేసాను. ఈ లోపల కింద రాజ్ ఫోన్ కూడా మోగడం స్టార్ట్ అయ్యింది.ఫోన్ ఎత్తగానే “మన కంపెనీలో ఏవో రైడ్స్ జరుగుతున్నాయంట TV ఆన్ చేయి చూపిస్తున్నారు…. ” అని చెప్పాడు.నాకు భయం వేసింది అసలు ఏమవుతుంది అని అర్ధంకాక. నేను కిందకి వెళ్లి చూస్తే రాజ్ TV ఆన్ చేసి చూస్తున్నాడు.తనకి కూడా న్యూస్ వచ్చినట్లుంది. తన ఫోన్ బాగా మోగుతుంది.“రాజ్ ఏమైంది ??” అని అడిగాను.“నేహా….లెట్స్ లీవ్ ది హౌస్ అండ్ గో” అన్నాడు.నేనేమి తెచ్చుకోలేదు కాబట్టి నేను రెడీ అనిచెప్పాను.“నిన్ను నేను బస్సు స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను, నీ ఇంటికి బస్సో క్యాబ్ లోనో వెళ్ళిపో” అని చెప్పాడు.ఇద్దరం ఇల్లు లాక్ చేసేసి కార్ ఎక్కి సిటీ లోకి వెళ్ళాము. నన్ను బస్సు స్టాప్ లో డ్రాప్ చేసి రాజ్ వెళ్ళిపోయాడు. నేను అక్కడనుంచి క్యాబ్ బుక్ చేసుకొని అపార్ట్మెంట్ కి వెళ్లాను.నేను బెల్ కొట్టగానే, నా రూమ్ మాటే తలుపు తీసింది.“ఎలా ఉంది మీ ఫ్రెండ్ కి ??” అని అడిగింది.నేను మొన్న ఫ్రెండ్ కి సీరియస్ అని, హాస్పిటల్ లోనే తోడుగా పడుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ ఇచ్చాను.“అంత ఇప్పుడు ఒకే, నిన్న వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ వచ్చారు…..” అన్నాను.“సరే తొందరగా రెడీ అవ్వు, ఆ హాస్పిటల్ నుంచి వచ్చిన బట్టలతో ఇక్కడ తిరగొద్దు” అని చెప్పింది.నాకసలేమి అర్ధం కాలేదు. నేను రెడీ అయ్యి వెంటనే టీవీ ఆన్ చేసి ఫోన్ లో యూట్యూబ్ ఆన్ చేసి చూస్తున్నాను ఎం జరుగుతోంది అని. ఆ ఫార్మ్ హౌస్ దగ్గరకి కూడా మీడియా వచ్చేసింది. గేట్ మూసేసి లాక్ లో ఉండటంతో. “కంపెనీ యాజమాన్యం పరారీ” అంటూ హెడ్లైన్స్ వేస్తున్నారు.ఏదో స్కాం బయటపడబోతుంది అంటూ న్యూస్ చానెల్స్ అన్ని హెడ్లైన్స్ వేస్తున్నాయి. నాకిదంతా తలుచుకుంటేనే బాగా టెన్షన్ అనిపించింది. ఒక అరగంట తర్వాత అశ్విన్ నుంచి మెసేజ్ వచ్చింది “do you want to meet me now??”ఓహో ఇందుకే అశ్విన్ resign చేస్తున్నాడా ?? తను కూడా ఏమైనా ఈ స్కాం లో ఉన్నాడా ?? అని ఆలోచించాను. ఐన మేనేజర్ లెవెల్ లో అంత సీన్ లేదు అనుకున్నాను. ఒకవేళ మీడియా నేను రాజ్ ఉన్నపుడే వచ్చునంటే ఏంటి పరిస్థితి ?? మేము అక్కడే ఇరుక్కుపోయావాళ్ళం. తలచుకుంటేనే భయం వేసింది.నేను వెంటనే రిప్లై ఇచ్చి “ఒకే లెట్స్ మీట్ ఎట్ కాఫీ డే….. ” అని లొకేషన్ పంపించాను. తను ఒక గంటలో వస్తానని చెప్పాడు. నేను టెన్షన్ భరించలేక వెంటనే అక్కడికి వెళ్ళిపోయాను.అప్పటికే 12 అయ్యింది. నేను బాగా వెయిట్ చేసాను అశ్విన్ కోసం. తను 12:30 కి వచ్చాడు అక్కడికి. అప్పటికే నేను ఒక రెండు కాఫీ లు తాగేసాను. వచ్చి నా ముందు కూర్చున్నాడు. ఇద్దరం ఎవ్వరు లేని చోట ఒక మూల కూర్చున్నాము.“నేహా, హౌ ర్ యూ ??”“సర్, అసలు ఎందుకీ మీటింగ్ ముందు చెప్పండి…..”“నువ్వు టీవిలో చూడలేదా న్యూస్ ??” అన్నాడు“సర్ చూసాను…..దాని గురించా ఈ మీటింగ్??” అని తెలియనట్లు అడిగాను.“ఒకే పాయింట్ కి వచ్చేస్తాను…..”“ఒకే…”