మరుసటి రోజు:అశ్విన్ నా కేబిన్ దగ్గరకు వచ్చాడు.“సర్……మీరు…..ఇక్కడ…….”ఎం పర్లేదు “సర్ చెప్పండి ??”“hmmmm………నిన్ను ఒకసారి మన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గారు కలుస్తారంట”నాకు అర్ధం కాలేదు.“కొన్ని సార్లు రాండమ్ గా పిలిచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు…..5th ఫ్లోర్ కి వేళ్ళు అక్కడ లిఫ్ట్ దిగగానే రైట్ తీసుకొని వెళ్తే అక్కడే అయన క్యాబిన్ ఉంటది”“ఇప్పుడు వెళ్లాలా ?? సర్”“అవును…..మరెప్పుడేళ్తావ్ ??”“ఓకే సర్……సారీ”నేను వెంటనే లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్లాను. అక్కడ వైస్ ప్రెసిడెంట్ క్యాబిన్ దగ్గరకు వెళ్లాను. అద్దంలో నుంచి చూసి డోర్ నాక్ చేశాను . లోపలికి రమ్మన్నారు. లోపలికి వెళ్లి అతని ముందు కూర్చున్నాను.“మీ పేరు ??”“నిహారిక…..నేహా అని పిలుస్తారు సర్ అందరూ”“ఒకే…….నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా ??”“ఎందుకు సర్ ??”“అశ్విన్ గారు నీకేమి చెప్పలేదా ??”“చెప్పారు సర్…….ఫీడ్ బ్యాక్ కోసం అని”“మరి తెలియనట్లు ఎందుకు అడిగావు ??”“సారీ సర్”“సరే………నీ మీద కంప్లైన్స్ వచ్చాయి…….”“నా మీద సర్ ??”“అవును……నువ్వు చాలా అందంగా ఉన్నావని”వీడు విడి యదవ జోకులు.“జస్ట్ కిడింగ్ ….. రిలాక్స్”“ఓ….” అని చాలా ఇబ్బంది పడుతూ నువ్వుతూ చెప్పాను.“ఒకే విషయానికి వద్దాం……అశ్విన్ గురించి చెప్పు……అతని గురించి నీ ఒపీనియన్ ఏంటి ??”నిజం చెప్పేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో ప్రియ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఒకవేళ నిజం చెప్పినా సరే అశ్విన్ కె సపోర్ట్ వెళ్తే కంపెనీ…..అప్పుడు నా ఉద్యోగానికి ప్రమాదం. అసలే అపార్ట్మెంట్ కూడా మారాలి నేను.“మంచి అతను సర్……..బాగా వర్క్ చేస్తారు……కంపెనీ కి మంచి అసెట్”“ఓ………నేను కొంతమంది దగ్గర అతని గురించి చేదుగా విన్నాను…….”“చేడుగాన సర్ ??”“యా అవును. అతను అమ్మాయల విషయంలో సరిగ్గా ఉండడని……తెలిసింది”మంచి ఛాన్స్ దొరికిందనుకున్నాను.“అంటే……నేను కూడా అలాంటివి విన్నాను సర్”“ఒకే గో ఆన్ …..”“కొంతమంది చెప్పిందేంటంటే…….అతను కొంత మందితో సంబంధం పెట్టుకొని…….వాళ్లను వేరుగా చూస్తారని…..”“య నాకు కూడా అలంటి feedbacke వచ్చింది”“నిన్ను ఎమన్నా అతను ఇబ్బంది పెట్టాడా ??”“లేదు సర్………”“ఒకే….”“ఈ విషయం గురించి నువ్వేమన్న ఎవరితోనైనా ఇంతక ముందు చెప్పావా ??”“లేదు సర్……..”అతను ఆలోచనలో పడ్డాడు.“hmmmmm……నిన్ను నేను అప్పుడప్పుడు పిలుస్తుంటాను……అతనిని బాగా observe చేయి ఇప్పటినుంచి…….”“సర్ ??”“అదే నువ్వు అమ్మాయివి కాబట్టి…..అతను నీ పై చేడుగా ప్రవర్తించవచ్చు…….అందుకే…….”నాకంత చాల తేడాగా అనిపించింది. నన్నెందుకు పిలిచారు ?? టీం లో ఉన్న అమ్మాయిలం ఇద్దరమే. ఒకటి ప్రియ రెండు నేను. అంటే ప్రియకు ప్రమోషన్ వచ్చి నాకు రాలేదు కాబట్టి పిలిచాడ ?? లేక రూమర్స్ విని పిలిచాడ ?? నేను కూడా అశ్విన్ తో కుమ్మకై ఉండొచ్చుకదా ?? చాల ప్రశ్నలు ఉన్నాయి నాలో.“ఒకే సర్…….”“ఓకే థాంక్స్….” అని చెబుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి “సరే నువ్వు వెళ్లొచ్చు…..ఇక”“ఓకే సర్”“అలాగే నీతో పాటు ఇంకో అమ్మాయి పనిచేస్తుంటాడంట…..ఎవరు ??”“ప్రియ సర్”“హా ప్రియ……ఒకసారి తనని కూడా కలవమని చెప్పు ఇప్పుడే……ఒకసారి”“ఒకే సర్”సో ఇద్దరినీ పిలిచారు. అంటే ఈ విషయం పై దాకా వెళ్లినట్లుంది. ఇప్పుడు ప్రియతో వైస్ ప్రెసిడెంట్ మాట్లాడితే ఎం తెలియనట్లు నటిస్తది. ఒకవేళ ప్రియ వైస్ ప్రెసిడెంట్ ఎం అడిగాడో అశ్విన్ కి మొత్తం చెప్పేస్తే ఏంటి పరిస్థితి ?? ఐన అశ్విన్ ఎం చేస్తాడులే, ఉంది వైస్ ప్రెసిడెంట్ అక్కడ. వీడు ఆయనను పీకేది ఏమి లేదు.నేను కిందకి వచ్చి నా కేబిన్ లో కూర్చున్నాను. జరిగిన దాని గురించి ఆలోచించాను. ఆలోచిస్తే, అశ్విన్ ఏక్సపోజ్ అవుతే ప్రియ కూడా ఎక్సపోజ్ అవుతుంది కదా. అందుకే ప్రియ, అశ్విన్ ని తప్పకుండ కాపాడుతుంది. ఇప్పుడు నేను కనుక వైస్ ప్రెసిడెంట్ కి ఉన్న విషయం మొత్తం చెప్పేస్తే, అప్పుడు ప్రియ, అశ్విన్ ఇద్దరు ఇంటికి వెళతారు నాకు ప్రమోషన్ వస్తుంది. కానీ అది బ్యాక్ ఫైర్ అయ్యిందంటే కంపెనీని అతను కాపాడి, నన్ను ఉద్యోగం లో నుంచి తీసేస్తాడు. నాకు ఎం నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాలేదు.